ప్రభాస్ ‘ఆదిపురుష్’లో శ్రీరాముడి పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. బాహుబలి ప్రభాస్ రాముడిగా బాగుంటాడనే ఏకాభిప్రాయం వినిపిస్తోంది. అయితే అతని సరసన సీతగా నటించేదెవరు? కియారా అద్వానీని ఆ పాత్రకు కన్సిడర్ చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఈ కథనాలను ఖండించలేదు.
అయితే ఈ న్యూస్ రామ భక్తుల చెవిన పడిన తర్వాత సీతగా ఆమెను అంగీకరించమని, వేరే ఎవరినైనా పెట్టుకోవాలని సోషల్ మీడియాలో విన్నపాలు పెడుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే కియారా ఇంతకుముందు చేసిన పాత్రలట. ‘లస్ట్ స్టోరీస్’లో వైబ్రేటర్ సీన్‍లో నటించిన తర్వాత ఆమె మీమ్స్ను వెటకారంగా వాడుతుంటారు. అలాగే ఇతర వెబ్ సినిమాలలో డ్రగ్స్, తాగుడు అలవాటున్న పాత్రలు పోషించింది.
ఆ ఇమేజ్ వున్న కియారాను సీతగా చూడలేమని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా ఆమెను ఈ పాత్రకోసం కన్సిడర్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ రియాక్షన్లు చూసిన తర్వాత వాళ్లు ఖచ్చితంగా ఆ ఐడియా డ్రాప్ చేసుకుంటారు. మరి ముందుగా వినిపించిన కీర్తి సురేష్ బెస్ట్ ఆప్షన్ అనుకుంటారా లేదా బాలీవుడ్ హీరోయిన్లలోనే సీతను వెతుక్కుంటారా?
This post was last modified on September 3, 2020 1:09 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…