చిన్న హీరోల సినిమాలకు రిలీజ్ డేట్ సెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ముఖ్యంగా పోటీ వీలైనంత తగ్గించుకుని ఓపెనింగ్స్ రాబట్టుకోవడం ఏదో సాహసయాత్ర చేసిన ఫీలింగ్ కలిగిస్తోంది. టీజర్ వచ్చి నెలలు దాటిపోయిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఎట్టకేలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2ని విడుదల తేదీగా లాక్ చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటనని హీరో హీరోయిన్ తో పాటు ఫ్రెండ్స్ బ్యాచ్ పాల్గొన్న ఒక వీడియో రూపంలో అనౌన్స్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ లవ్ స్టోరీ కోసం సుహాస్ నిజంగా గుండు కొట్టించుకుని ఆడియన్స్ కి షాక్ ఇవ్వబోతున్నాడు.
ఇక్కడ అనుకోకుండా అంబాజీపేటకు అతని గత హిట్ సెంటిమెంట్ ఒకటి కలిసి వస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 3 రైటర్ పద్మభూషణ్ మంచి సక్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు తెచ్చుకుని బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. తిరిగి సరిగ్గా అదే టైంలో తన కొత్త మూవీ రావడం కాకతాళీయమే అయినా కొన్నిసార్లు ఇలాంటివే పని చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సుహాస్ కి కలిసి వచ్చేలాగే ఉంది. దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో శివాని హీరోయిన్ గా నటిస్తోంది.
గీతా ఆర్ట్స్ 2తో కలిపి మూడు నిర్మాణ సంస్థలు ఇందులో భాగం కావడం విశేషం. సెలూన్ లో పని చేసే కుర్రాడు ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తే ఎదురయ్యే పరిస్థితులను చాలా విభిన్నమైన నేపథ్యంతో చెప్పబోతున్న విషయమైతే అర్థమయ్యింది. కలర్ ఫోటోతో వచ్చిన గుర్తింపుని కాపాడుకునే దిశగా సుహాస్ తనకు సూటయ్యే కథలనే ఎంచుకుంటున్నాడు. బడ్జెట్ పరంగా నిర్మాతలు క్రమంగా స్కేల్ పెంచుతున్నారు. అయితే కేవలం వారం గ్యాప్ లో టిల్లు స్క్వేర్, యాత్ర 2, ఊరి పేరు భైరవకోన ఉన్నాయి కాబట్టి పోటీ అయితే గట్టిగానే ఉండబోతోంది. సో సుహాస్ పెద్ద టార్గెటే పెట్టుకోవాలి.
This post was last modified on December 26, 2023 3:57 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…