ఈ మధ్య వెబ్ సిరీస్ లో ఏదైనా షాకింగ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులకు వెంటనే చేరిపోయి దాని గురించిన చర్చలు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ‘కర్రీ అండ్ సైనైడ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్ వచ్చింది. ఇది 2002 నుంచి 2014 మధ్య జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. కేరళలోని కూడతాయి అనే పట్టణంలో జాలీ జోసెఫ్ అనే ఆవిడ ఏళ్ళ తరబడి తన స్వంత కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఒక్కొక్కరిని తిండిలో విషం పెట్టి చంపిన దారుణమైన సంఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. పదేళ్ల తర్వాత ఈ దారుణం వెలుగు చూసింది.
బాగా వెనుకబడిన కుటుంబానికి చెందిన జాలీ చదువుకున్న కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితంలో లగ్జరిలను చూడొచ్చనే ఉద్దేశంతో రాయ్ థామస్ ని జీవిత భాగస్వామి చేసుకుంటుంది. ఉద్యోగం చేయమని అత్త పోరు పెట్టడంతో ముందు ఆవిడని చంపేస్తుంది. తర్వాత తన మగ స్నేహాల మీద అనుమానపడిన మావయ్యని విషపు గుళికలు ఇచ్చి ప్రాణాలు తీస్తుంది. ఆ తర్వాత బంధువుని మోహించి అతని రెండేళ్ల కూతురిని, అతని భార్యని, ఇదంతా ముందే పసిగట్టిన దగ్గరి బంధువును ఇలా అందరినీ కాటికి పంపిస్తుంది. చివరికి ఆడపడుచుకి డౌట్ వచ్చి పోలీస్ కంప్లయింట్ ఇచ్చాక శవాలను తవ్వి తీస్తారు.
పక్కా ఆధారాలతో జాలీ కటకటాలపాలైంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. స్వంత కొడుకే తల్లి హంతకురాలని మీడియా ముందు చెప్పడం సంచలనం రేపింది. దీన్ని గంటా నలభై నిమిషాల సిరీస్ తరహా మూవీగా అందించారు. ఇందులో నిజంగా ఈ ఘటనకు సాక్షులుగా నిలిచిన కుటుంబ సభ్యులు, పోలీసులతో ఇంటర్వ్యూలు చేసి, ఇవన్నీ జరిగిన ఇళ్లను ప్రత్యక్షంగా చూపించి ఒళ్ళు గగుర్పొడిచేలా చూపించారు. సినిమాల్లో, వెబ్ సిరీస్ లు చూసి మనుషులు ఇంత దారుణంగా ఉంటారాని అనుకుంటాం కానీ అంత కన్నా కిరాతకంగా మంచితనం ముసుగు వేసుకున్న జాలీలు ఎందరో.
This post was last modified on December 26, 2023 12:04 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…