సంక్రాంతి సినిమాల గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏకంగా అయిదు క్రేజున్న టాలీవుడ్ స్ట్రెయిట్ చిత్రాలు సై అంటే సై అంటూ కవ్వించుకోవడం ఓపెనింగ్స్ పట్ల ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇవి కాకుండా మరో రెండు మూడు డబ్బింగ్ బొమ్మలు బరిలో దిగేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల సమాఖ్య ప్రమేయాన్ని కోరుకున్నారు అభిమానులు. ఓ దఫా సమావేశం కూడా జరిగింది. ఇవాళ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో అతిథిగా వచ్చిన దిల్ రాజు దానికి సంబంధించి ఒక ముఖ్య విషయాన్ని చెప్పారు.
ఎవరైనా సంక్రాంతి నుంచి తప్పుకునే పనైతే వాళ్ళు తర్వాత ఏ డేట్ అయితే కోరుకుంటారో అప్పుడు పోటీ రాకుండా సోలో రిలీజ్ దక్కేలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. వినడానికి బాగానే ఉంది కానీ ఎవరూ తగ్గే సూచనలు పది శాతం కూడా కనిపించడం లేదు. గుంటూరు కారం ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12 నుంచి తప్పుకోవడం లేదు. అదే డేట్ కి హనుమాన్ వేసే తీరతామని నిర్మాత నొక్కి చెబుతున్నారు. ఈగల్, సైంధవ్ ఒక రోజు అటోఇటో జనవరి 13 కావాలని పంతం పట్టుకుని కూర్చున్నాయి. నా సామిరంగ జనవరి 14 అనౌన్స్ మెంట్ రేపో ఎల్లుండో వస్తుంది.
ఇలాంటి పద్మవ్యూహంలో బయటికి వచ్చేందుకు ఏ నిర్మాతా ఇష్టపడటం లేదు. సోలో రిలీజ్ ఆఫర్ బాగానే ఉంది కానీ దానికి ఎవరు రెస్పాండ్ అవుతారన్నది చెప్పడమా కష్టమే. ఇంకో రెండు మూడు రోజుల్లో చెబుతామని దిల్ రాజు అంటున్నారు కానీ ప్రాక్టికల్ గా జరిగే పనిలా కనిపించడం లేదు. నిజానికి ఈ సమస్య గతంలో చాలా సార్లు వచ్చింది. ఈ ఏడాదే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒకే బ్యానర్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో రిలీజైతే మిగిలిన వాళ్ళు తప్పుకున్నారు. డబ్బింగ్ వారసుడుని దిల్ రాజు గారు తీసుకొచ్చారు. ఒకవేళ నిజంగా రాజుగారన్నట్టు ఎవరైనా డ్రాప్ అంటే మిగిలినవాళ్ళకు అది పెద్ద గుడ్ న్యూసే
This post was last modified on December 25, 2023 8:39 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…