సలార్ విడుదలై మూడు రోజులు దాటేసింది. ఒకపక్క రికార్డులు బద్దలైపోతున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీని డామినేట్ చేసే తరహాలో అన్ని చోట్ల వసూళ్ల సునామి సృష్టిస్తోంది. అయితే ఇప్పటిదాకా దర్శక ధీర రాజమౌళి తన స్పందన ఇంకా చెప్పలేదని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కు ముందు ఆయనే స్వయంగా చొరవ తీసుకుని సలార్ టీమ్ అభ్యర్థన మేరకు ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి హోంబాలే ఫిలిమ్స్ చేసిన ప్రమోషన్ ఇదొక్కటే. ఇందులో కంటెంట్ బాగా వైరల్ అయ్యింది కూడా.
అలాంటిది రాజమౌళి సోషల్ మీడియాలో ఇంకా సలార్ గురించి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇవ్వకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి నుంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు అంటే చాలా బిజీ ఉన్నాడు కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు కానీ మాములుగా మొదటి రోజే ఇలాంటి సినిమాలు చూసే అలవాటున్న జక్కన్న ఇప్పటిదాకా ఆగారంటే నమ్మడం కష్టమే. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన రాజమౌళి దాని విషయంలోనూ మౌనంగా ఉన్నారు. అదంటే కంటెంట్ మీద డిబేట్లు జరిగాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు. కానీ సలార్ కు ఆ సమస్య లేదుగా. అధిక శాతం ఆడియన్స్ మెచ్చుకున్నదేగా.
రేపో ఎల్లుండో ఏదైనా ట్వీట్ లేదా వీడియో ఉంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కి ఇంత పెద్ద ప్యాన్ ఇండియా ఇమేజ్ రావడానికి బాహుబలి వేసిన పునాది చిన్నది కాదు. అదే లేకపోతే ఇవాళ డార్లింగ్ మార్కెట్ ఈ స్థాయిలో ఉండేది కాదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అందుకే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ టైంలోనూ రాజమౌళి వాటి పట్ల ఆసక్తి చూపించి తనవంతుగా అంచనాలు పెంచేందుకు దోహదపడ్డారు. వరల్డ్ కప్ లో కోహ్లీ గురించి అభినందన ట్వీట్ తర్వాత రాజమౌళి నుంచి ట్విట్టర్ లో ఎలాంటి యాక్టివ్ మూమెంట్ లేదు. సలార్ తో మళ్ళీ మొదలుపెడతారేమో చూడాలి.
This post was last modified on December 24, 2023 11:27 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…