అన్నయ్య కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకు సంబంధించి తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ అంతగా చొరవ తీసుకోవడం లేదు కాబట్టి ఇద్దరి మధ్య ఏవో భేదాలు వచ్చాయనే వార్తలు ఫ్యాన్స్ లో టెన్షన్ కలిగించడం సహజం. అయితే అలాంటిదేమీ లేదని సన్నిహితులు మాట. అసలు తారక్ ప్రతిసారి అన్న చిత్రాలను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే బింబిసారకు అండగా నిలబడితే బ్లాక్ బస్టర్ అయ్యింది. మరి అమిగోస్ కూడా అలాంటి ఫలితమే రావాలిగా. కానీ ఏమైంది. సో కేవలం కుటుంబ సభ్యుల మద్దతుతో బాక్సాఫీస్ రిజల్ట్స్ మారిపోవనేది గుర్థించుకోవాలి.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర షూట్ కి చిన్న బ్రేక్ ఇచ్చాడు. దర్శకుడు కొరటాల శివ న్యూ ఇయర్ కి టీజర్ రూపంలో తన ప్రపంచాన్ని పరిచయం చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఒకవేళ హీరోకి నచ్చితే కొత్త సంవత్సర కానుకగా చూడొచ్చు. ఇక డెవిల్ విషయానికి వస్తే చాలా ప్రామిసింగ్ కంటెంట్ కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఆశించిన స్థాయిలో బజ్ పెరగడం లేదు. జనాలు సలార్ ఫీవర్ లో ఉండటంతో ఈ శుక్రవారం ఏమోస్తున్నాయో ఇంకా దృష్టి పెట్టడం లేదు. ఈలోగా కళ్యాణ్ రామ్ మెల్లగా ప్రమోషన్లలో భాగమవుతున్నాడు. ఆన్ లైన్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టేశారు.
దర్శకుడి మార్పుకు సంబంధించి గతంలో కొంత వివాదం నడిచింది కాబట్టి దాన్ని వీలైనంత హైలైట్ కాకుండా నిర్మాత కం డైరెక్టర్ అభిషేక్ నామా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియా సైతం దాని ప్రస్తావన తేకుండా యూనిట్టే చెప్పే దాకా ఎందుకు లెమ్మని మౌనంగా ఉంది. పోటీ పరంగా పెద్దగా రిస్క్ లేదు కానీ డెవిల్ కు టాక్ రావడం చాలా కీలకం. బబుల్ గమ్ పెద్ద పోటీ కాకపోయినా సలార్ రెండో వారానికి నెమ్మదిస్తుందన్న గ్యారెంటీ లేదు. పైగా పెరిగిన టికెట్ రేట్లు అప్పుడే తగ్గబోతున్నాయి. సో భారీ బడ్జెట్ తో వస్తున్న డెవిల్ ముందు సవాళ్లయితే ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవడమే తరువాయి.
This post was last modified on December 24, 2023 9:25 pm
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…