రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ల తర్వాత చూడాల్సిన ఫలితం కాదిది. డంకీ పెర్ఫార్మన్స్ చూసి అభిమానులు ఫీలవుతోంది ఇదే. అలా అని సినిమా దారుణమైన డిజాస్టర్ కాదు. చూసినవాళ్లు తిట్టిపోయడం లేదు. అంచనాలు అందుకోలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు తప్పించి విపరీతంగా నిరాశ పడ్డామనే మాట కాదు. అలా నిర్మొహమాటంగా తిరస్కారానికి గురయ్యింది జీరో మాత్రమే. రాజ్ కుమార్ హిరానీ తో షారుఖ్ ఖాన్ మొదటిసారి చేతులు కలిపాడు కాబట్టి 3 ఇడియట్స్, పీకేని మించిన అవుట్ ఫుట్ మూవీ లవర్స్ ఆశించారు. కానీ అందులో సగం అందుకోడమే కష్టంగా అనిపించింది.
ఎవరు ఔనన్నా కాదన్నా డంకీ ఖచ్చితంగా సలార్ తాకిడి వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఖన్సార్ లో దేవా చేస్తున్న హింసాత్మక విధ్వంసం ముందు హార్డీ వలసవాద కష్టాలు. కామెడీలు మాస్ జనాలకు ఎక్కడం లేదు. ఓవర్సీస్ వరకు బాగానే చేస్తున్నప్పటికి జవాన్, పఠాన్ టైంలో కనిపించిన ఊపు సగం కూడా లేదు. నిర్మాతలు అధికారికంగా చెప్పిన ప్రకారమే రెండు రోజులకు కేవలం వంద కోట్లే రాబట్టిన డంకీకి ఆదివారం వసూళ్లు మెరుగ్గా ఉండటం కలిసి వస్తోంది. ఒకవేళ సలార్ తో రిస్క్ చేయకుండా డంకీ కనక సోలోగా వచ్చి ఉంటే ప్రయోజనం ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండదన్నది వాస్తవం.
ఆడియన్స్ కి ఆప్షన్ లేని సమయంలో డంకీ లాంటి వాటికి ప్లస్ అవుతుంది. మాస్ అంశాలు లేనప్పుడు అలాంటి కంటెంట్ తోనే వస్తున్న సలార్ ని తక్కువంచనా వేయడం వల్లే ఈ సమస్య వచ్చి పడింది. షారుఖ్ చేశాడు కాబట్టి డంకీ ఈ మాత్రమైనా లాగుతోంది. ఒకవేళ ఏ వరుణ్ ధావనో సిద్దార్థ్ మల్హోత్రానో చేసి ఉంటే రెండో రోజుకే టపా కట్టాల్సి వచ్చేదన్న మాట అబద్దం కాదు. ఒకటి మాత్రం నిజం. హిరానీలోని మేజిక్ టచ్ తగ్గిపోయింది. ఇంకా ఆయన పదేళ్ల వెనుక ఎంటర్ టైన్మెంట్ మీదే ఆధారపడుతున్నారు. అప్డేట్ అవ్వకపోతే ఎంత క్లాసిక్ డైరెక్టర్ కైనా ఇలాంటి రిజల్టే వస్తుంది.
This post was last modified on December 24, 2023 9:27 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…