మాములుగా ఒక నిర్మాణ సంస్థ పెద్ద స్థాయికి చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఉదాహరణకు సురేష్ ప్రౌఢుక్షన్స్, గీత ఆర్ట్స్, వైజయంతి మూవీస్ లాంటివి వందల కోట్ల బడ్జెట్ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. కానీ హోంబాలే ఫిలింస్ మాత్రం దీనికి భిన్నంగా ఎదుగుతోంది. కెజిఎఫ్, కాంతార, సలార్ దెబ్బకు ఒక్కసారిగా ఇండియాస్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటిగా మారిపోయింది. అయితే దీని వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. అదేంటో చూద్దాం. ఈ బ్యానర్ అధినేత విజయ్ కిరగందూర్ స్వంత ఊరు కర్ణాటకలోని మండ్య జిల్లాలో చిన్న గ్రామం.
సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు గ్రామదేవత హోంబాలమ్మ పేరుని మిత్రుడు పునీత్ రాజ్ కుమార్ సూచించడంతో ఇంకేం ఆలోచించకుండా నామకరణం చేశారు. మొదటి చిత్రం నిన్నిందలే ఈ కాంబోలోనే ఘనవిజయం సాధించింది. యష్ తో తీసిన మాస్టర్ పీస్ బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా వీరి దశ తిరిగిపోయింది. తర్వాత పునీత్ రాజకుమార కూడా అదే ఫలితం అందుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో పరిచయం, కెజిఎఫ్ కు రూపకల్పన జరగడం, శాండల్ వుడ్ స్థాయి వెయ్యి కోట్లను దాటడం చకచకా జరిగిపోయాయి. విజయ్ భాగస్వామి చలువే గౌడ.
పునీత్ ఇచ్చిన సూచన వల్లే తనకు అమ్మవారి పేరు ఇంత ఖ్యాతిని విజయాలను ఇస్తోందని విజయ్ కిరగందూర్ నమ్మకం. పునీత్ తో ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీని ప్రకటించాక అతను హఠాత్తుగా కన్నుమూయడం హోంబాలే అధినేతలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఒకవేళ పునీత్ కనక బ్రతికి ఉంటే కన్నడ చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే ఒక గొప్ప చిత్రాన్ని అందించేవాడినని విజయ్ తన సన్నిహితులతో అంటుంటారు. సలార్ సైతం బ్లాక్ బస్టర్ కావడంతో వీళ్ళ ఆనందం మాములుగా లేదు. తర్వాత బఘీరా, సలార్ 2 శౌర్యాంగ పర్వంలతో లైనప్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.
This post was last modified on December 24, 2023 2:15 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…