Movie News

ఓటిటి కోసం ఎడిటింగ్ పనిలో సందీప్ వంగా

అదేంటి యానిమల్ విడుదలై పాతిక రోజులకు దగ్గరగా ఉంటే ఇంకా ఈ ఎడిటింగ్ ఏంటనుకుంటున్నారా. నిజమే. థియేట్రికల్ వెర్షన్ కోసం తాను రాజీ పడిన లోటుని భర్తీ చేసుకోవడానికి ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చే ప్రింట్ లో అన్ కట్ సీన్స్ ని జోడించే పనిలో ఉన్నాడట. ముందు తాను అనుకున్న 3 గంటల 30 నిమిషాల నిడివికి కట్టుబడి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు అవసరమో వాటిని స్వయంగా చూసుకుంటున్నానని తాజాగా ఒక ముంబై మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో యాంకర్ షాక్ తిన్నాడు. ఇంకా పూర్తవ్వలేదని చెప్పడం మరో షాక్.

ఈ లెక్కన యానిమల్ స్మార్ట్ స్క్రీన్ లో చూసినప్పుడు ఫిల్టర్స్ లేకుండా స్పెషల్ సీన్లతో కొత్తగా కనిపిస్తాడన్న మాట. తొమ్మిది వందల కోట్లు దాటేసిన తర్వాత ఏ దర్శకుడైనా నింపాదిగా రెస్ట్ తీసుకోవడమో ;లేదా కొత్త సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టుకోవడమో చేస్తాడు. అంతే తప్ప ఇలా అమ్మేసిన ఓటిటి ప్రింట్ కోసం ఇంత కష్టపడటం అరుదు. కానీ సందీప్ వంగా మాత్రం రాజీ పడేది లేదంటున్నాడు. నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నది ఇది కాదు. అసలు ఏ చిన్న కట్ లేకుండా సందీప్ మొదట్లో ఆమోదించిన నాలుగు గంటలకు పైగా ఉన్న లెన్త్ ని చూడాలని కోరుకుంటున్నారు.

కానీ అది సాధ్యపడకపోవచ్చు. లియో, పఠాన్, జవాన్ లాంటి వాటికి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది కానీ తీరా చూస్తే ఒకటి రెండు నిముషాలు తప్ప పెద్దగా తేడా లేకుండా స్ట్రీమింగ్ చేశారు. కానీ యానిమల్ వాటికి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. స్వయంగా సందీప్ వంగానే రంగంలోకి దిగాడు కాబట్టి మరింత పర్ఫెక్షన్ తో చూడొచ్చు. ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్, అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ఇలా వరసగా మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేసుకున్న సందీప్ రెడ్డి వంగాని వేరే హీరోలు ఎవరైనా కోరుకుంటే కనీసం 2027 దాకా ఎదురు చూడక తప్పేలా లేదు

This post was last modified on December 23, 2023 10:25 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago