ఇద్దరూ కన్నడ సంగీత దర్శకులే. పక్కభాషల్లో ముఖ్యంగా తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నవాళ్ళే. కానీ అవుట్ ఫుట్ విషయంలో మాత్రం ఫీడ్ బ్యాక్ ఒకేలా రావడం లేదు. నిన్న విడుదలైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ లో చాలా భాగం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కెజిఎఫ్ స్థాయిలో లేదని, పైపెచ్చు అదే రిపీట్ అయ్యిందనే ఫీలింగ్ కలిగిందని నెటిజెన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈయన గత చిత్రాలు కబ్జా, శాసనసభలు కనీస స్థాయిలో మెప్పించేలేకపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అజయ్ దేవగన్ భోళా, సల్మాన్ ఖాన్ కిసీకా బాయ్ కిసీకా జాన్ లకు ఏమంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు.
అలా అని రవి బస్రూర్ ని తక్కువంచనా వేయడమని కాదు కానీ ఈ విషయంలో తన తోటి శాండల్ వుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ తరహాలో వెరైటీ ప్రయోగాలు చేస్తేనే ఆడియన్స్ ని మరింత దగ్గరవుతామని గుర్తించాలి. విరూపాక్ష, మంగళవారంలకు అతనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ప్లస్ అయ్యిందో విమర్శకులు సైతం ఒప్పుకున్నారు. ఎవరిదాకో ఎందుకు సలార్ నిర్మాతల మరో ప్యాన్ ఇండియా మూవీ బఘీరాకు సంగీతం ఇస్తున్నది అజనీషే. విక్రాంత్ రోనాలో రా రా రక్కమ్మ లాంటి కమర్షియల్ ఐటెం సాంగ్ తో మాస్ చార్ట్ బస్టర్స్ చేయగలనని నిరూపించుకున్నాడు.
సో రవి బస్రూర్ నుంచి క్రేజీ బీజీఎమ్ ని ఆశిస్తున్నారు అభిమానులు. సలార్ ఎలివేషన్లలో ఇతని పాత్రని తక్కువ చేసి చెప్పలేం కానీ అంచనాలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టే ఆ బరువును మోసి గెలిస్తే అవకాశాలు క్యూ కడతాయి. ఎంతో కష్టపడి పైకొచ్చిన రవి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలున్నాయి. సలార్ 2 ఇంకా టైం పడుతుంది కానీ ఆలోగా జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తనకే వస్తుంది. దాన్ని కనక సరిగ్గా వాడుకుంటే ఆఫర్ల పరంగా ఆకాశమే హద్దుగా మారిపోతుంది. తెలుగులో జీబ్రా, సీతామనోహర శ్రీరాఘవ చేస్తున్న రవి బస్రూర్ కు నీల్ కాకుండా వేరే స్టార్ డైరెక్టర్ తో మరో కమర్షియల్ మూవీ పడాలి.
This post was last modified on December 23, 2023 12:32 pm
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…