సలార్ లాంటి భారీ చిత్రం వస్తోందంటే ముందు వెనక వారాల్లో కూడా కొత్త సినిమాలను రిలీజ్ చేయడానికి ఆలోచించాల్సిందే. పైగా క్రిస్మస్ కే షెడ్యూల్ అయిన హిందీ సినిమా డంకికి కూడా క్రేజ్ బాగానే ఉండడంతో ముందు వారం చిన్నాచితకా సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. అయితే తర్వాతి వారానికి మాత్రం డెవిల్ తో పాటు బబుల్ గమ్, సర్కారు నౌకరి, వ్యూహం బాక్సాఫీస్ పోటీలో నిలిచాయి.
వీటిలో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న చిత్రం డెవిల్. దానిమీద నిర్మాత, బయ్యర్ల పెట్టుబడి కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ఆ వీకెండ్ రిలీజ్ ఏమో అన్న చర్చ జరిగింది. థియేటర్ల విషయంలో కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే క్రిస్మస్ సినిమాల రిలీజ్ తర్వాత ఆ భయాలు తొలగిపోయినట్లే కనిపిస్తోంది.
షారుక్ సినిమా డంకి తెలుగు రాష్ట్రాల్లో తొలి వీకెండ్ తర్వాత పెద్దగా ప్రభావం చూపే సంకేతాలు కనిపించడం లేదు. మల్టీప్లెక్స్ లు సైతం స్క్రీన్లు, షోలు తగ్గించడం ఖాయం. ఇక సలార్ ఓపెనింగ్స్ తో మొదలు పెట్టినప్పటికీ.. ఆ సినిమాకు పూర్తి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. తొలి రోజు మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ సినిమా.. వీకెండ్ వరకు వసూళ్ల మోత మోగించడం ఖాయం. కానీ డివైడ్ టాక్ వీకెండ్ తర్వాత కొంచెం దెబ్బ కొట్టొచ్చు.
ఇలాంటి భారీ చిత్రాలకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే రెండో వీకెండ్ లో కూడా ప్రభంజనం సృష్టిస్తాయి. వేరే చిత్రాలకు అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతం వచ్చిన టాక్ ను బట్టి చూస్తే వచ్చేవారం చిత్రాలు మరీ భయపడాల్సిన పనిలేదని అర్థమవుతోంది. రెండో వీకెండ్లోనూ సలార్ జోరు కొనసాగినా వేరే సినిమాలకు కూడా స్కోప్ అయితే ఉంటుంది. థియేటర్ల విషయంలోనూ మరీ ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు. ముఖ్యంగా క్రిస్మస్ సినిమాల టాక్ డెవిల్ కు గొప్ప రిలీఫ్ అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 22, 2023 9:37 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…