పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు, నటించబోయే ఓ సినిమా నుంచి విశేషాలు బయటికి రాబోతున్నట్లు ముందే ప్రకటనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయమే ‘వకీల్ సాబ్’ మోషన్ టీజర్ రిలీజ్ చేశారు. అది అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా పవర్‌ఫుల్‌గా కనిపించడంతో పవన్ అభిమానులు ఖుషీ అయ్యారు.
ఇక మధ్యాహ్నానికి మరో ట్రీట్ రెడీ అయిపోయింది. పవన్ 27 సినిమా నుంచి ప్రి లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్‌యే స్వయంగా ప్రి లుక్ రిలీజ్ చేశాడు. పవన్ ముఖం ఏమీ చూపించకుండానే అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఈ లుక్ డిజైన్ చేశారు. ముందు నుంచి అనుకుంటున్నట్లే చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని.. పవన్ ఒక యోధుడిలాగా కనిపించబోతున్నాడని స్పష్టమవుతోంది.
పవన్ ఒంటి మీద ఉన్న ప్రాపర్టీస్‌తోనే ఈ లుక్ చాలా రాయల్‌గా ఉండబోతోందని సంకేతాలు ఇచ్చింది ప్రి లుక్. కచ్చితంగా అభిమానుల్ని మురిపించేలా పవన్ పాత్ర ఉంటుందనిపిస్తోంది. ఈ లుక్ షేర్ చేస్తూ.. ‘‘పవన్ కళ్యాణ్ గారు #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ #HBDPawanKalyan’’ అని ట్వీట్ చేశాడు క్రిష్.
పవన్‌తో ఖుషీ, బంగారం సినిమాలు తీసిన ఎ.ఎం.రత్నం చాలా ఏళ్ల విరామం తర్వాత అతడితో ఈ సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు ప్రచారం జరిగినట్లే కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు ఖరారైంది. క్రిష్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం అందించనున్నాడు. మాటలు సాయిమాధవ్ బుర్రా రాస్తున్నాడు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్.
This post was last modified on September 2, 2020 2:07 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…