సలార్ వర్సెస్ డంకి.. పోటీ లేదు పోలికా లేదు

ఈ క్రిస్మస్ కు ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో ఒక మెగా క్లాష్ కు రంగం సిద్ధమైంది. షారుక్ ఖాన్- రాజ్ కుమార్ హిరానీల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం డంకి, ప్రభాస్- ప్రశాంత్ నీల్ ల మెగా కాంబినేషన్లో రూపొందిన సలార్ ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండిట్లో ఒకటి వాయిదా పడక తప్పదని గతంలో ప్రచారాలు జరిగినప్పటికీ చివరికి ఎవరు తగ్గకుండా రెండు చిత్రాలను ఒకే వీకెండ్లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు.

ఈ రెండు చిత్రాల్లో వేటి బలాలు వాటికే ఉండడంతో పోటీ గట్టిగానే ఉంటుందని అంచనా వేశారు. మాస్- యాక్షన్ మూవీ కావడం వల్ల సలార్ కు కొంచెం ఎడ్జ్ ఉండొచ్చు అని భావించారు. కానీ రిలీజ్ టైంకి కథ వేరేలా ఉంది. సలార్ ప్రభంజనాన్ని డంకీ అసలు తట్టుకునేలా లేదు.

అడ్వాన్స్ బుకింగ్స్ లో రెండు చిత్రాలకు కనీసం పోలిక పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. సలార్ సినిమాకు ఏ థియేటర్లో అయినా టికెట్లు పెట్టిన నిమిషాల్లో అయిపోతుంటే డంకీకి ఫుల్స్ పడడానికి రోజులు పడుతోంది. అలా అని సలార్ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే క్రేజ్ ఉంది అనుకుంటే పొరపాటే. నార్త్ ఇండియాలో సైతం ఈ సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు ఇవ్వబడుతున్నారు. టికెట్లు హాట్ కేకుల్లా తెగుతున్నాయి. ఇక దక్షిణాదిన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అయితే ఏపీ, తెలంగాణలకు దీటుగా క్రేజ్ కనిపిస్తోంది. డంకి సినిమాకు ఉత్తరాదిన మెరుగైన స్పందన ఉంది కానీ.. సౌత్ ఇండియాలో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ పూర్ గా ఉన్నాయి. సోల్డ్ అవుట్ షోలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫీలింగ్ మోడ్ లో ఉన్న షోలు కూడా తక్కువే.

సలార్ కంటే డంకి ఒకరోజు ముందుగా రిలీజ్ అవుతుండగా.. ఆ రోజు పరిస్థితి కొంచెం మెరుగే కానీ, సలార్ రిలీజ్ డే మాత్రం డంకీని సౌత్ ఇండియన్ ఆడియన్స్ పట్టించుకునేలా కనిపించడం లేదు. ఓపెనింగ్స్ విషయంలో సలార్ ముందు డంకి ఏ మాత్రం నిలబడేలా లేదు. అందులో మూడో వంతు వసూళ్లు వచ్చినా గొప్పే కావచ్చు. సలార్ కి కు టాక్ బాగుంటే మాత్రం దాని విధ్వంసాన్ని తట్టుకోవడం డంకీకి చాలా కష్టమే.