విలక్షణమైన కథలతో తొందరపాటు లేకుండా కేవలం హిట్లతో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. గూఢచారి, క్షణం సినిమాలకు పని చేసిన షానియేల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ డ్రామా తాలూకు టైటిల్ ని ఒక వెరైటీ టీజర్ ద్వారా ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామ్యంలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. చూపించింది చిన్న సన్నివేశమే అయినా నిమిషంన్నర వీడియోలో కథేంటో పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
అదో అందమైన ప్రేమజంట. ఘాడంగా ప్రేమించుకుని కలిసి ఒక్కటవుదామనుకుంటారు. కానీ నేర ప్రపంచం వీళ్ళ దారిని మారుస్తుంది. విడిపోతారు. అది కూడా తీవ్రమైన పరిస్థితుల్లో ఒకరిని మరొకరు చంపుకునేంత పగతో రగిలిపోతారు. జాడ తెలియని అజ్ఞాతంలో బ్రతుకుతారు. ఒక రోజు రోడ్డు మీద శవాల గుట్టలు తాండవం చేస్తున్న క్షణంలో కలుసుకునే సందర్భంగా వస్తుంది. ఒకరు మెషీన్ గన్, మరొకరు తుపాకీ పట్టుకుని కాల్చేందుకు సిద్ధ పడతారు. అసలు ఈ లవర్స్ ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు. టైటిల్ లోనే దొంగని ఎందుకు పెట్టారనేదే అసలు ప్రశ్న.
ఆసక్తి రేపడంలో టైటిల్ టీజర్ విజయవంతమయ్యింది. సింపుల్ విజువల్స్ మధ్య స్టోరీలోని సీరియస్ నెస్ ని దర్శకుడు షానియేల్ డియో చక్కగా ప్రెజెంట్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ లో భీమ్స్ సిసిరిలియో నేపధ్య సంగీతం మంచి ఇంటెన్స్ గా సాగింది. ధనుష్ భాస్కర్ ఛాయాగ్రహణం, అబ్బూరి రవి అడిషనల్ స్క్రీన్ ప్లేతో పాటు సంభాషణలు సమకూరుస్తున్నారు. మిగిలిన క్యాస్టింగ్ తాలూకు డీటెయిల్స్ ఏవీ చెప్పలేదు. 2024లో గూఢచారి 2తో పాటు డెకాయిట్ గా రాబోతున్న అడవి శేష్ పక్కా ప్లానింగ్ తో ఒకే సంవత్సరం రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates