మూవీ లవర్స్ ని అంచనాలతో ఊపేస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏ నిముషంలో అయినా ఓపెన్ కావడం ఆలస్యం యాప్స్ క్రాష్ అయ్యే రేంజ్ లో రచ్చ జరిగేలా ఉంది. రిలీజ్ ని ఉద్దేశించి కట్ చేసిన యాక్షన్ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ల మధ్య స్నేహం, శత్రుత్వానికి దారి తీసిన పరిస్థితులు మొదటి భాగంలో ప్రధానంగా హైలైట్ కాబోతున్నాయి. మరి సలార్ 2లో ఏం ఉంటుందనే కుతూహలం కలగడం సహజం. అదేంటో చూద్దాం.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం సలార్ 1లో చూపించేది దేవా, రాజమన్నార్ ల కథ. దేవా తండ్రి అలియాస్ సలార్ రెండో భాగంలో వస్తాడని వినికిడి. సలార్ 1 ప్రీ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇప్పించి ఒక్కసారిగా హైప్ ని సీక్వెల్ వైపు మళ్లించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా స్కెచ్ తో సెట్ చేశాడట. కొనసాగింపులో జగపతి బాబు పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. ఇదంతా టీమ్ అఫీషియల్ గా చెప్పింది కాదు కానీ లీకులైతే గట్టిగానే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కొనదేరిన మీసాలతో చూపించిన గెటప్ అసలు సలార్ దని, ఇప్పుడు చూస్తున్న ప్రభాస్ కొడుకు క్యారెక్టరని అంటున్నారు.
ఈ సస్పెన్స్ అంతా ఇంకో మూడు రోజుల్లో తీరిపోతుంది. డంకీ పోటీని తట్టుకుని అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్ ఏకంగా షారుఖ్ ఖాన్ ని డామినేట్ చేయడం చూసి అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. ఈజీగా వెయ్యి కోట్ల గ్రాస్ దాటుతుందని, ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల మధ్య ఫైనల్ రన్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంక్రాంతి దాకా సలార్ కి సాలిడ్ గా ఇరవై రోజుల ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది. ఒకవేళ ఇండస్ట్రీ హిట్ అయ్యే రేంజ్ లో ఉంటే మాత్రం పండగ సీజన్ లోనూ కొనసాగుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
This post was last modified on December 19, 2023 7:24 pm
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో…
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష…