ఏదైనా ఓపెన్ గా మాట్లాడ్డం అంత సులభం కాదు. అందులోనూ స్టార్ హీరోలతో వందల కోట్ల సినిమాలు చేస్తున్న దర్శకులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రశాంత్ నీల్ నేను ఆ బాపతు కాదంటున్నారు. ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న సలార్ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. కెజిఎఫ్ లో ఏవైతే పొరపాట్లు చేశానో సలార్ లోనూ అవే తప్పులు చేయాల్సి వచ్చిందని, పరిస్థితుల ప్రభావం, పని ఒత్తిడి తప్ప వేరే కారణం లేదని స్పష్టం చేశారు. అయితే ఆ మిస్టేక్స్ ఏంటనేది మాత్రం బయటికి చెప్పడం లేదు.
ఇక సినిమాల ద్వారా ఇచ్చే సందేశాల గురించి కూడా నీల్ ఘాటుగా సమాధానం చెప్పాడు. నేను ఇక్కడ ఉన్నది మెసేజ్ లు ఇవ్వడం కోసమో, సమాజంలో పరివర్తన తేవడం కోసమో కాదని, అది తలితండ్రులు చేయలేనప్పుడు నేనెవర్ని మిమ్మల్ని మార్చడానికి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఇంత స్ట్రెయిట్ గా చెప్పాక ఇక బదులు చెప్పడానికి ఏముంటుంది. సలార్ పూర్తిగా విభిన్న ప్రపంచమని, కెజిఎఫ్ తో ఏ రూపంలో ఏ రకంగా అయినా రవ్వంత కూడా కనెక్షన్ ఉండదని కుండ బద్దలు కొట్టాడు. సినిమాటిక్ యునివర్స్ ని హ్యాండిల్ చేసే సత్తా తనలో లేదని స్పష్టంగా చెప్పేశాడు.
రెండో ట్రైలర్ వచ్చాక సలార్ అంచనాల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. మొదటి వెర్షన్ లో ప్రభాస్ ఎక్కువ కనిపించలేదన్న కొరతని పూర్తిగా తీర్చేశారు. ముఖ్యంగా యాక్షన్ విజువల్స్ దెబ్బకు మొదటి రోజు చూడకుండా కంట్రోల్ చేసుకోవడం ఫ్యాన్స్ కి కష్టంగా అనిపిస్తోంది. ఏపీ తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ నిమిషం అయినా మొదలుపెట్టేలా ఉన్నారు. కర్ణాటక, కేరళలో ఇప్పటికే అమ్మకాలు ఉదృతంగా ఉన్నాయి. నార్త్ లో స్క్రీన్ల పంపకాల్లో డంకీ, అక్వమెన్ ల నుంచి ఇబ్బంది తలెత్తున్నప్పటికీ ఫైనల్ గా సలార్ లోని మాస్ కంటెంట్ సులభంగా వంద కోట్ల గ్రాస్ దాటించేలా ఉంది.
This post was last modified on December 19, 2023 11:17 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…