Movie News

శత్రువులతో ఆకాశ యుద్ధం ‘ఆపరేషన్ వాలెంటైన్’

ఇటీవలే కొత్త పెళ్ళికొడుకుగా లావణ్య త్రిపాఠితో కలిసి నూతనోధ్యాయం మొదలుపెట్టిన వరుణ్ తేజ్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తెరపైకి వస్తున్నాడు. వాస్తవానికి ఈ డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఆపరేషన్ వాలెంటైన్ పలు కారణాల వల్ల తేదీ మార్చుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 థియేటర్లలో అడుగు పెట్టనుంది. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ వార్ డ్రామా ద్వారా వరుణ్ మరోసారి ఎక్స్ పరిమెంట్ చేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న స్కై థ్రిల్లర్ ని సోనీ ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇందాకా టీజర్ ని రిలీజ్ చేశారు.

శత్రుదేశం ఎంత కవ్వించినా ఓపికగా ఎదురు చూసే సంయమనం మన సైన్యానిది. ఎయిర్ ఫోర్స్ లో పని చేసే అర్జున్ దేవ్(వరుణ్ తేజ్) ది దూకుడు మనస్తత్వం. ప్రమాదాలను కవ్వించి మరీ ఎదురెళ్తాడు. ఈ క్రమంలో ఒక క్లిష్టమైన మిషన్ అప్పజెబుతుంది ప్రభుత్వం. రుద్ర అనే ఏజెంట్ పేరుతో జెట్ ఫ్లైట్ వేసుకుని వెళ్లిన అర్జున్ కి ఆకాశంలోనే ఎన్నో సవాళ్లు ప్రమాదాలు స్వాగతం చెబుతాయి. తనను ప్రేమించిన అమ్మాయి(మానుషీ చిల్లర్)కూడా తన విభాగమే కావడంతో ప్రోత్సహిస్తుంది. అసలు ఇంత పెద్ద ఆపరేషన్ కి వాలెంటైన్ పేరు ఎందుకు పెట్టారో అదే అసలు కథ.

నిమిషంన్నర వీడియోతో కంటెంట్ లోని గ్రాండియర్ ని స్పష్టంగా ఆవిష్కరించారు. వరుణ్ మార్కెట్ లెక్కలు కాకుండా సబ్జెక్టుని నమ్ముకుని ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు ఇది రీచ్ అవుతుందనే నమ్మకంతో తీసినట్టు కనిపిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తో పాటు స్క్రీన్ ప్లేలో అమీర్ ఖాన్, సిద్దార్థ్ రాజ్ కుమార్ పాలు పంచుకున్నారు. టెక్నికల్ గా స్టాండర్డ్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అంచనాలు రేకెత్తించేలా చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. ఫిబ్రవరి 16న ఆపరేషన్ వాలెంటైన్ ప్రేక్షకుల ముందుకు రానుంది

This post was last modified on December 18, 2023 7:57 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

56 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago