Movie News

సలార్ 100 కోట్ల ఓపెనింగ్ సాధ్యమేనా

ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉన్నా, ప్రమోషన్ల విషయంలో హోంబాలే ఫిలింస్ ఎలాంటి దూకుడు చూపించకపోయినా ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న సలార్ జ్వరం మూవీ లవర్స్ ని అమాంతం కమ్మేస్తోంది. పరిమిత లొకేషన్లతో కర్ణాటక, కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఇప్పటికే చెరో కోటి రూపాయలు దాటేసింది. ఇంకా చాలా థియేటర్లు జోడించే పనిలో ఉన్నారు. ఏపీ, తెలంగాణలో అధికారిక జిఓలు వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే. అవి వచ్చిన మరుక్షణం ఆన్ లైన్ అమ్మకాలు ఊపందుకుంటాయి. ఓవర్సీస్ లో కేవలం నాలుగు మార్కెట్ల నుంచే ఒకటిన్నర మిలియన్ వసూలు చేయడం చిన్న విషయం కాదు.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ సాధ్యమేనా అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ప్రభాస్ కు ఆ సత్తా ఉందని, ఒక ప్యాన్ ఇండియా మూవీకి జరగాల్సిన హడావిడి కనిపించకపోయినా కంటెంట్ మీద నమ్మకంతోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడని అంటున్నారు. రెండు మూడు షోలయ్యాక వచ్చే టాక్ తో ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడుతున్నారు. షారుఖ్ డంకీ, ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డం వల్ల ఫస్ట్ డేకే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సుల స్క్రీన్లు పంచుకోవాల్సి రావడం సలార్ కున్న అతి పెద్ద అడ్డంకి.

ఇవాళ విడుదల చేయబోతున్న రాజమౌళితో చేయించిన స్పెషల్ ఇంటర్వ్యూలో చాలా సంగతులు ఉంటాయని, దాన్ని చూశాక ఒక్కసారిగా అంచనాల్లో మార్పు వస్తుందని లెక్కలేస్తున్నారు. కొత్త ట్రైలర్ కూడా హైప్ పెంచేలా ఉంటుందట. ఒకవేళ సలార్ కనక వంద కోట్ల మైలురాయి డిసెంబర్ 22నే అందుకుంటే బాహబలి 2, ఆదిపురుష్, సాహో తర్వాత ఆ ఘనత సాధించినట్టు అవుతుంది. ప్రభాస్ కు మాత్రమే సాధ్యమయ్యే మైలురాయిగా ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. తెలుగు వెర్షన్ బుకింగ్స్ మొదలయ్యాక జరిగే రచ్చ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.

This post was last modified on December 18, 2023 10:36 am

Share
Show comments

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

3 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

5 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

6 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

6 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

7 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

7 hours ago