త్వరలోనే ఈ ఏడాది బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ చూడబోతున్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో బాలీవుడ్ భారీ చిత్రం డంకిని.. సౌత్ మెగా మూవీ సలార్ ఢీకొట్టబోతోంది. ఈ రెండు చిత్రాలు వేటికవే ప్రత్యేక ఆసక్తి కలిగిస్తున్నాయి. రెంటి మీదా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు చిత్రాల్లో ఏది పై చేయి సాధిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మాస్, యాక్షన్ మూవీ కావడం వల్ల సలార్ కి ఓపెనింగ్స్ ఎక్కువగా వస్తాయనడంలో సందేహం లేదు. ఇది కచ్చితంగా సలార్ కు అడ్వాంటేజే.
కానీ సలార్ మీద పెట్టుబడులు భారీగా పెట్టేసిన బయ్యర్లలో ఆందోళన లేకపోలేదు. ఒకవేళ సలార్ టాక్ కొంచెం అటు ఇటు అయి.. డంకికి మెరుగైన టాక్ వస్తే అది బాక్సాఫీస్ దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సలార్ కు గట్టి దెబ్బ పడుతుంది.
అదే సమయంలో క్లాస్ సినిమా కావడం, సలార్ లాంటి భారీ యాక్షన్ మూవీతో పోటీ పడడం డంకీకి మైనస్. ఇందువల్ల పఠాన్, జవాన్ చిత్రాలకు వచ్చిన ఓపెనింగ్స్ తో పోలిస్తే తక్కువ ఆరంభ వసూళ్లతో డంకి సరి పెట్టుకోవాల్సిందే. పండుగ సీజన్లో ఇలా పెద్ద సినిమాలు పోటీ పడినప్పుడు టాక్ బాగున్న సినిమాకు అనుకున్న దానికంటే భారీ వసూళ్లు వస్తాయి. అదే సమయంలో టాక్ తేడా కొట్టిన సినిమా అన్యాయం అయిపోతుంది.
అందులోనూ పెద్ద సినిమా అయితే.. భారీ పెట్టుబడులు పెట్టిన చిత్రమైతే దెబ్బ మామూలుగా ఉండదు. ఇదే సలార్ బయ్యర్లను కంగారు పెడుతోంది. మొత్తంగా చూస్తే క్రిస్మస్ కు రాబోతున్న రెండు చిత్రాలకు రిస్క్ ఉన్నట్లే. కాకపోతే టాక్ బాగున్న సినిమా ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుని జాక్ పాట్ కొడుతుంది. బాలేని సినిమా డేంజర్ జోన్లో పడుతుంది. మరి సలార్, డంకీల్లో ఆ ముప్పుని ఎదుర్కొనే చిత్రమేదో చూడాలి.
This post was last modified on December 18, 2023 10:16 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…