వైష్ణవ్ తేజ్ సినిమా ‘ఉప్పెన’ ఓటిటిలో రిలీజ్ కావడం లేదు. ఇంత కంటే పెద్ద సినిమాలే ఓటీటీల బాట పట్టగా దీనిని ఎందుకని విడుదల చేయడం లేదు? నిజానికి ఓటిటి రిలీజ్‍కి నిర్మాతలు సిద్ధంగానే వున్నారు. ఒకటి, రెండు ఓటిటి సంస్థలతో చర్చలు కూడా జరిపారు. అయితే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కావడంతో ఓటిటిలు అంత మొత్తం ఆఫర్ చేయడం లేదు. ఆల్రెడీ మార్కెట్ వున్న హీరోల సినిమాలనయితే పెద్ద మొత్తం ఇచ్చి కొనేస్తున్నారు. ఫలానా హీరో సినిమా హిట్టయితే ఎంత ఆదాయం వస్తుందనేది లెక్కలు చూసుకుని అంత ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. కానీ వైష్ణవ్‍కి ఇది మొదటి సినిమా కావడంతో అతని మార్కెట్ ఏమిటనేది ఎవరికీ తెలియదు. వాళ్లు ఈ సినిమాకు ఆఫర్ చేసిన అమౌంట్ వల్ల లాస్ బాగా వస్తుంది కనుక థియేటర్లు తెరిచే వరకు వేచి చూడాలనే డిసైడ్ అయ్యారు.
ఒక విధంగా వైష్ణవ్ తేజ్ అదృష్టమిది అనుకోవాలి. ఏ హీరోకి అయినా మొదటి సినిమా థియేటర్లలో విడుదలైతేనే తన పట్ల ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా వున్నారనేది తెలుస్తుంది. ఓపెనింగ్స్ వస్తే మెగా ఫాన్స్ యాక్సెప్టెన్స్ వుందా లేదా అనేది అర్థమవుతుంది. అలా తన సినిమాకి అన్నీ తెలుసుకునే అవకాశం వైష్ణవ్‍కి దక్కింది. ఒకవేళ బడ్జెట్ తక్కువ అయినట్టయితే మొదటి సినిమానే టీవీలో చూడాల్సి వచ్చేది.
This post was last modified on September 2, 2020 1:32 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…