ఇండియాలో అత్యంత విలక్షణత కలిగి అసలు పరాజయమే లేని అతి కొద్ది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరానీ పేరు ముందు వరసలో ఉంటుంది. ఇన్నేళ్ల సుదీర్ఘమైన కెరీర్ లో తీసింది కొన్ని సినిమాలే అయినా ప్రతిదీ ఆణిముత్యంగా చెప్పుకోదగిన క్లాసిక్స్ ఇచ్చారు. మున్నాభాయ్ ఎంబిబిఎస్, మున్నాభాయ్ జిందాబాద్, 3 ఇడియట్స్, పీకే, సంజు ఇలా వేటికవే గర్వంగా చెప్పుకునే చిత్ర రాజాలు. ఈ నెల 21 విడుదల కాబోతున్న డంకీ మీద అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. షారుఖ్ ఖాన్ ని మొదటిసారి ఎలా డైరెక్ట్ చేసుంటారనే ఆసక్తి మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది.
తాజాగా రాజ్ కుమార్ హిరానీ ఓటిటి బాట పెట్టబోతున్నారు. అయితే దర్శకుడిగా కాదు నిర్మాతగా. ఇటీవలే 12త్ పాస్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న విక్రాంత్ మాసే హీరోగా రూపొందబోయే వెబ్ సిరీస్ ప్రధానంగా వెబ్ సెక్యూరిటీ మీద నడుస్తుంది. ఆన్ లైన్ నేరాలు, టెక్నాలజీని నేరస్థులు వాడుకునే విధానం ఇవన్నీ కూలంకుషంగా చూపించబోతున్నారు. డైరెక్షన్ అమిత్ సత్యవీర్ సింగ్ కి ఇస్తున్నారు. మెగా ఫోన్ చేపట్టేది ఈయనే అయినా రచనతో మొదలుపెట్టి పర్యవేక్షణ దాకా అన్నీ హిరానీనే చూసుకుంటారట. డిస్నీ హాట్ స్టార్ దీని కోసం భారీ బడ్జెట్ ని కేటాయించబోతోంది.
ఇక డంకీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న హిరానీ చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ తో మొదలుపెట్టి ప్రతి ప్రమోషన్ మెటీరియల్ ఆశించిన హైప్ తీసుకురాలేకపోయింది. ఇంకోవైపు సలార్ మీద పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డంకీ నెగ్గడం అంత సులభంగా ఉండదు. ఓవర్సీస్ తో పాటు మనదేశంలోనూ భారీ ఎత్తున స్క్రీన్లను బ్లాక్ చేసుకున్న డంకీ కనక హిరానీ సక్సెస్ రికార్డుని కొనసాగిస్తే మంచిదే. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ కల్ట్ డైరెక్టర్ కి మొదటి ఫ్లాప్ పడుతుంది. అసలే వలసవాదం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకుని మరీ షారుఖ్ తో ప్రయోగం చేశారు
This post was last modified on December 15, 2023 5:28 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…