Movie News

హైదరాబాద్ కుర్రాడి ‘బబుల్ గమ్’ ప్రేమ

స్టార్ యాంకర్ గా దశాబ్దాలుగా తిరుగు లేని స్థానాన్ని అనుభవిస్తున్న సుమ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం కలిగిన రాజీవ్ కనకాల దంపతుల వారసుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న సినిమా బబుల్ గమ్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలతో దర్శకుడిగా ఒక ప్రత్యేక ముద్ర సంపాదించుకున్న రవికాంత్ పేరేపు కుర్రాడిని లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో మంచి బడ్జెట్ తో దీన్ని రూపొందించారు. కథేంటి, రోషన్ లుక్స్ ప్లస్ నటన ఎలా ఉండబోతున్నాయనే దాని మీద ఐడియా వచ్చేలా కట్ చేసిన ట్రైలర్ ఇందాక విడుదల చేశారు.

జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ మస్తుగా బ్రతకడమే లైఫనుకునే ఒక బస్తీ కుర్రాడు ఆది(రోషన్ కనకాల). పార్టీల్లో డీజే వాయిస్తూ ఎప్పటికైనా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యం పెట్టుకుంటాడు. ఈ క్రమంలో బాగా డబ్బున్న ఓ అమ్మాయి జాను(మానస చౌదరి) ఇతనికి పరిచయమై కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. క్రమంగా అది ప్రేమగా మారుతున్న తరుణంలో ఇంకో అబ్బాయి జానుకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. తనది వేరొకరు లాక్కుపోతారని అనుమాన పడితేనే నానా రచ్చ చేసే ఆది ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోతాడు. అక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది.

యూత్ ని టార్గెట్ చేసుకున్న రవికాంత్ దానికి తగ్గట్టే కంటెంట్ ని డిజైన్ చేసుకున్నాడు. రోషన్ నటనపరంగా కొత్తే అయినప్పటికీ పాత్రకు కావాల్సిన ఎమోషన్స్ ని బాగానే క్యారీ చేసినట్టు కనిపిస్తోంది. డైలాగులు యువత మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం, సురేష్ రగుటు చాయాగ్రహణం సమకూర్చారు. సలార్ వచ్చిన వారానికే డిసెంబర్ 29 బబుల్ గమ్ ని విడుదల చేయబోతున్నారు. మాములుగా నటీనటుల కొడుకులు తెరంగేట్రం చేయడం సహజం కానీ ఒక లేడీ యాంకర్ తనయుడు తెరమీదకు రావడం అరుదు. మరో రోషన్ ఏం చేయబోతున్నాడో ఇంకో రెండు వారాల్లో తేలనుంది.

This post was last modified on December 15, 2023 12:50 pm

Share

Recent Posts

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

39 minutes ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

1 hour ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

5 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

6 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

7 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

7 hours ago