ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి వచ్చే తీరాలన్న సంకల్పంతో పరుగులు పెడుతున్న నా సామిరంగాలో అల్లరి నరేష్ పాత్రని టీజర్ రూపంలో పరిచయం చేశారు. పక్కా పల్లెటూరి మాస్ గెటప్ లో తెగ అల్లరి చేస్తూ, ఎవరు ఏమడిగినా మాటొచ్చేత్తాది అంటూ సరదాగా అనడం బాగుంది. పెళ్లి కొడుకు గెటప్ లో నాగార్జునతో కలిసి చిందులేయడం, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం చూస్తే ఇద్దరి మధ్య కెమిస్ట్రీని దర్శకుడు విజయ్ బిన్నీ చక్కగా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. వీడియో చివర్లో సైకిల్ వెనుక నాగ్ ని కూర్చోబెట్టుకుని విజిల్ వేసుకుంటూ అలా పొలం గట్ల మీద వెళ్లే షాట్ తో ముగించారు.
చిన్న బిట్ అయినప్పటికీ మాస్ ని నచ్చేలా సెట్ చేయడంలో విజయ్ బిన్నీ సక్సెసయ్యాడు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం మరో ఆకర్షణ కానుంది. అయితే విడుదల తేదీ మాత్రం రివీల్ చేయలేదు. టీజర్ ని బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో ప్రకటించే ఆవకాశముంది. జనవరి 12 కి ముందా లేక జనవరి 14 లేదా 15 ఈ మూడు ఆప్షన్లను సీరియస్ గా పరిశీలిస్తున్నారు. పండగకు నాలుగు రోజుల ముందే వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే తర్వాత వేగంగా పికప్ అవుతుందనే విశ్లేషణల మధ్య నాగ్ టీమ్ ఏ నిర్ణయం తీసుకున్నారో ఇంకా తెలియదు.
ఇది మలయాళం పోరంజు మరియం జోస్ రీమేక్ కాదని దర్శకుడు విజయ్ బిన్నీ చెబుతున్నప్పటికీ విజువల్స్ మాత్రం ఆ కథకు దగ్గరగానే అనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ హీరోల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. డైరెక్టర్ లాక్ కాక ముందే రచయిత ప్రసన్న కుమార్ రాసిపెట్టిన స్క్రిప్ట్ ఇది. ఏవో కారణాల వల్ల కుదరలేదు కానీ లేదంటే దర్శకుడిగా ఇతని పేరే ఉండేది. రాజ్ తరుణ్ మరో కీలక పాత్ర పోషిస్తున్న నా సామిరంగలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సెంటిమెంట్ తో హ్యాట్రిక్ కొట్టాలనేది నాగ్ టార్గెట్
This post was last modified on December 15, 2023 11:18 am
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…