కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెజిఎఫ్ పుణ్యమాని ఇప్పుడు కన్నడ మార్కెట్ పెరిగింది కానీ ఒకప్పుడు మహా అయితే యాభై కోట్ల గ్రాస్ దాటడమే గొప్పనుకునే బ్లాక్ బస్టర్లు వాళ్ళవి. అందుకే శాండిల్ వుడ్ డబ్బింగులు మన దగ్గర చాలా తక్కువ. కాంతారతో వాళ్ళ నమ్మకం బలపడింది. అలా అని మన మార్కెట్ ఏమీ తగ్గలేదు. డిమాండ్ మారలేదు. ఇది అక్కడి హీరోలు, నిర్మాతలకు ఎప్పటి నుంచో కంటగింపుగా ఉంది. తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ సలార్ గురించి ఒక ప్రెస్ మీట్ లో అన్న మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇతను నటించిన భారీ బడ్జెట్ చిత్రం కాటేరా ఈ నెల 29 విడుదల కాబోతోంది. అయితే కేవలం వారం ముందే సలార్, డంకీలు ఉండటంతో థియేటర్ల సమస్య రావొచ్చని మీడియా ప్రతినిధులు దర్శన్ దృష్టికి తీసుకొచ్చారు. అంతే ఒక్కసారిగా బాబు ఫైరయిపోయాడు. ఎవరో వస్తే నేనేందుకు భయపడాలి, కాటేరా మనోళ్ల కోసం ఇక్కడి థియేటర్ల కోసం తీసిన సినిమాని, తగ్గేదే ఉండదంటూ కాస్త గట్టిగానే అన్నాడు. ఇదే టాపిక్ కొన్ని వారాల క్రితం ఘోస్ట్ రిలీజ్ సందర్భంగా శివ రాజ్ కుమార్ ముందు వచ్చినప్పుడు ఆయన చాలా సౌమ్యంగా పరిష్కారం ఉభయ కుశలోపరిగా ఉండాలని సూచించాడు.
సినిమా అయినా మరొకటి అయినా ఇది వ్యాపారం. కస్టమర్లు ఏది కోరుకుంటే దాన్ని ఇవ్వాలి. అంతే. బలవంతంగా రుద్దితే పని జరగదు. బెంగళూరులో ఉన్న డెబ్భై శాతం మల్టీప్లెక్సులు కేవలం తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ చిత్రాలతోనే గట్టెక్కుతున్నాయి. పోనీ కన్నడవి వేసుకున్నా ఆడియన్స్ వస్తారన్న గ్యారెంటీ లేదు. కర్ణాటలోని చాలా పట్టణాలు, నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాటేరాలో దర్శన్ ఊర మాస్ పాత్ర చేశాడు. గతంలో ఇతని రాబర్ట్, క్రాంతి తెలుగులోనూ డబ్ అయ్యాయి కానీ ఆ రొటీన్ కంటెంట్ ని మనోళ్లు తిరస్కరించారు. కాటేరా ఇతర భాషల్లో రావడానికే జంకుతోంది.
This post was last modified on December 15, 2023 11:15 am
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…