‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో లోకేష్ కనకరాజ్ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. అతని తర్వాతి సినిమా ‘లియో’ సినిమా మీద అంచనాలు ఏ స్థాయికి చేరాయో తెలిసిందే. ఐతే ‘లియో’ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. లోకేష్ కెరీర్లో వీకెస్ట్ మూవీ ఇదే అనడంలో సందేహం లేదు. అసలేముందని ఈ కథతో సినిమా తీశాడు అనే ప్రశ్నలు తలెత్తాయి. అతను అప్పుడే టచ్ కోల్పోయాడా.. తనలో కంటెంట్ అయిపోయిందా అనే చర్చ జరిగింది. ఐతే తన ప్రతి సినిమాకూ వచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకుని పని చేస్తానని చెప్పే లోకేష్.. తన తర్వాతి చిత్రం విషయంలో జాగ్రత్త పడుతున్న విషయం వెల్లడైంది. లియో విషయంలో జరిగిన తప్పేంటో లోకేష్ స్వయంగా ఒప్పుకున్నాడు.
‘లియో’ విషయంలో జరిగిన అతి పెద్ద తప్పు.. స్క్రిప్టు, షూటింగ్ విషయంలో హడావుడి పడటం. ‘విక్రమ్’ రిలీజైన కొన్ని రోజులకే ఈ సినిమాను మొదలుపెట్టేశాడు. స్క్రిప్టు సరిగా తీర్చిదిద్దుకోలేదు. షూటింగ్ కూడా హడావుడిగా చేసేశారు. ముందే రిలీజ్ డేట్ డెడ్ లైన్ పెట్టుకుని ఆ ప్రెజర్ మీద పని చేశాడు లోకేష్. ఆ ఎఫెక్ట్ ఔట్ పుట్ మీద పడింది. ఈ విషయమై లోకేష్ ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడాడు. లియో సెకండాఫ్ విషయంలో వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ మొత్తం తాను తీసుకున్నానని.. రజినీకాంత్ తో తాను చేయబోయే జాగ్రత్త పడతానని లోకేష్ తెలిపాడు.
లియో సినిమాకు సంతకం చేసినప్పుడే 10 నెలల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేలా ఒప్పందం జరిగిందని.. ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. ఆ ఒత్తిడితోనే పనిచేశానని.. దానివల్ల అవుట్ ఫుట్ దెబ్బతిందని లోకేష్ ఒప్పుకున్నాడు. రజినీకాంత్ సినిమా విషయంలో ముందే రిలీజ్ డేట్ ప్రకటించట్లేదని.. తనకు కావాల్సినంత టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేస్తానని.. సినిమా తీసే విషయంలో కూడా రాజీపడనని లోకేష్ తెలిపాడు. లోకేష్ మాటలను బట్టి చూస్తే అతడి నుంచి కొత్త సినిమా రావడానికి దాదాపు రెండేళ్లు పట్టొచ్చని తెలుస్తోంది. కాబట్టి ఈసారి అతడి నుంచి మంచి క్వాలిటీ మూవీ ఆశించవచ్చు.
This post was last modified on December 14, 2023 9:36 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…