విడుదలకు ఇంకో వారమే ఉన్నా డంకీ సౌండ్ పెద్దగా వినిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. సలార్ లాంటి డైనోసర్ ని ఎదురుగా పెట్టుకుని ఇంత నిశ్చింతగా ఉండటం విచిత్రమే. జవాన్ టైంలో పది రోజుల ముందు నుంచే రెండు రోజులకోసారి ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో క్రమం తప్పకుండా టచ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు మాత్రం అంత దూకుడు చూపించడం లేదు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు బాద్షా చాలా ఎగ్జైట్ కావడం జనాలకు గుర్తే. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించాలన్న కోరిక తీరిందని సంబరంగా చెప్పుకున్నాడు. పైగా స్వంత బ్యానర్ నిర్మాణం కూడా.
ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. లోలోపల ప్లానింగ్ చాప కింద నీరులా జరిగిపోతోందని ముంబై టాక్. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మొత్తం థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో 40 శాతం డంకీకి వచ్చేలా రెడ్ చిల్లీస్ తో పాటు మరికొన్ని కార్పొరేట్ సంస్థలు చేతులు కలపడంతో వ్యవహారం దానికి సానుకూలంగా మారుతోంది. ఓటిటి హక్కులు కొన్న జియో సినిమా కూడా తన వంతుగా చేయూత ఇస్తోందట. దీని వల్ల సలార్ కు ఎంత డిమాండ్ ఉన్నా సరే అన్ని భాషలకు కలిపి 38 శాతం స్క్రీన్లు ఇస్తారని టాక్. 12 శాతం ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డమ్, 10 శాతం మూడో వారం చేరుకున్న యానిమల్ కి కేటాయిస్తారు.
ఇదే జరిగితే సలార్ నేషనల్ వైడ్ ఓపెనింగ్స్ కి గండి పడినట్టే. పైగా డంకీ ఒకరోజు ముందే వస్తుంది కాబట్టి ప్రభాస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లలో డిసెంబర్ 21 మొత్తం డంకీనే వేస్తారు. మరుసటి రోజు నుంచి రెండు సినిమాల మధ్య పంపకాలు ఉంటాయి. ట్రైలర్ తో సహా డంకీ ప్రమోషనల్ కంటెంట్ కి ఆశించిన స్థాయిలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. అలా అని హిరానీకి తక్కువంచనా వేయడానికి లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈయన బ్రాండ్ కు తిరుగు లేదు. టాక్ చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ రేంజ్ లో ఫలితం కోసం ప్రభాస్, షారుఖ్ లు ఎదురు చూస్తున్నారు
This post was last modified on December 14, 2023 4:30 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…