Movie News

రేపు 10 సినిమాల ముప్పేట దాడి

యానిమల్, హాయ్ నాన్నలు సంతృప్తి పరిచాకా మళ్ళీ కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. డిసెంబర్ 22 సలార్, దానికన్నా ఒక రోజు ముందు డంకీ వస్తున్నాయని తెలిసి కూడా కేవలం వారం రోజుల రన్ కోసం ఏకంగా 10 సినిమాలు శుక్రవారం బరిలో దిగుతున్నాయి. అంతో ఇంతో హారర్ ప్రియుల దృష్టిలో బజ్ తెచ్చుకున్న వాటిలో పిండం ప్రధానమైంది. ప్రమోషన్లు గట్రా బాగానే చేస్తున్నారు. విరాజ్ అశ్విన్ జోరుగా హుషారుగా ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకుని వస్తోంది. డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి సపోర్ట్ దక్కడంతో సరిపడా థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో దొరికాయి.

ఇవి కాకుండా ఆలంబన, దళారి, కలశ, తికమక తండ, శంతల, సఖి, చే లాంగ్ లివ్, మాయలో బరిలో దిగుతున్నాయి. దేనికీ కనీస బజ్ లేకపోయినా మౌత్ టాక్ వస్తే ఎంతో కొంత జనాన్ని ఆకట్టుకోమా అనే నమ్మకంతో రిలీజ్ కు సిద్ధపడ్డాయి. క్యాస్టింగ్ పరంగానూ పెద్ద మెరుపులేం లేకపోవడంతో పాటు పబ్లిసిటీ అంతంత మాత్రంగా జరగడంతో ఇవి ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేకపోతున్నాయి. సలార్ వచ్చాక అన్నీ దుకాణం సర్దాల్సిందే కానీ అసలు వారం రోజుల పాటు దొరికిన ప్రతి థియేటర్లో ఇరవై ఎనిమిది షోలలో ఎన్ని క్యాన్సిల్ కాకుండా కాపాడుకుంటాయో అదే ఛాలెంజ్ గా మారనుంది.

నెంబర్ అయితే ఘనంగానే ఉంది కానీ వీటిలో చాలా సినిమాలు కనీస ఫీడింగ్ కు ఉపయోగపడవని బయ్యర్లు ఫీలవుతున్నారు. కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ సరిపడా ఖర్చులైనా టికెట్ల రూపంలో వసూలైతే సర్దుకోవచ్చు కానీ మరీ అయిదు పది టికెట్లు తెగితే వచ్చినోళ్లను వెనక్కు పంపడం తప్ప ఏం చేయగలమని వాపోతున్నారు. యానిమల్ ఇంకా బాగానే రాబడుతోంది. ఏ సెంటర్స్ లో హాయ్ నాన్నా స్టడీగా ఉన్నాడు. ఎక్స్ ట్రాడినరి మ్యాన్ సెలవు తీసుకోవడం లాంఛనమే. అయినా సరే ఇన్నేసి నువ్వా నేనా అని తలపడటం చూస్తే ఆశ్చర్యం కన్నా విచిత్రం అనిపిస్తే తప్పేం కాదు.

This post was last modified on December 14, 2023 1:35 pm

Share

Recent Posts

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

15 minutes ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

21 minutes ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

1 hour ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

1 hour ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

2 hours ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

2 hours ago