ఈ రోజుని మినహాయిస్తే సలార్ విడుదలకు ఇంకొక్క వారమే టైం ఉంది. ట్రయిలర్ కు వచ్చిన మిక్స్డ్ టాక్ అభిమానులను కొంత నిరాశ పరిచినప్పటికీ క్రమంగా బజ్ అంతకంతా పెరుగుతోంది. నిన్న విడుదల చేసిన ఎమోషనల్ సాంగ్ సూరీడే గొడుగు పట్టి పాట గుంటూరు కారం ఓ మై బేబీని డామినేట్ చేసే రేంజ్ లో మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోవడం విశేషం. ఇక బెనిఫిట్ షోలు ఎప్పటి నుంచి ఉంటాయనే దాని మీద క్రమంగా స్పష్టత వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మొదటి మూడు రోజులకు అదనంగా ఒక ఆట కలిపి మొత్తం ఆరు షోలకు అనుమతులు వచ్చాయని ఇన్ సైడ్ టాక్.
తెల్లవారుఝామున 4 గంటలకు ఇవి మొదలు కాబోతున్నాయి. సంక్రాంతికి ఇదే టైమింగ్ ని ఫాలో అయ్యారు. అయితే కేరళ తరహాలో హైదరాబాద్ లాంటి కీలక కేంద్రాల్లో అర్ధరాత్రి 12కి కొన్ని ప్రీమియర్లు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ పంపిణి చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టికెట్ పెంపు మల్టీప్లెక్సులకు 100 రూపాయల దాకా అడిగారు కానీ ఎంతమేరకు మంజూరయ్యిందో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం యశోద హాస్పిటల్ లో అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి కొంత ఆలస్యం కావొచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరీ నైజాం అంత ఎర్లీగా షోలు ఉండకపోవచ్చు. టికెట్ పెంపు యాభై నుంచి డెబ్భై అయిదు రూపాయల వరకే ఉంటుందని తెలిసింది. అయిదు లేదా ఆరు గంటల తర్వాత షోలు స్టార్ట్ అవుతాయి. ఎన్నికల హడావిడి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పర్మిషన్లు త్వరగా వస్తాయనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లున్నారు. డంకీ ఉండటం వల్ల సలార్ స్క్రీన్లలో కొంత కోత తప్పదు. ఏ సెంటర్స్ లో అక్వమెన్ ఫాలెన్ కింగ్ డంతోనూ పంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డంకీ ఫలితం మరీ తేడా కొడితే అప్పుడది సలార్ కౌంట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. చూద్దాం.
This post was last modified on December 14, 2023 1:35 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…