Movie News

బేబీ ఘాటు అభిమానులకు సరిపోలేదా

సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అత్యంత క్రేజు మోజు ఉన్న గుంటూరు కారం నుంచి ఏ అప్డేట్ అయినా సరే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఇవాళ రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. ఓ మై బేబీ అంటూ శ్రీలీల హీరో మహేష్ బాబు వెంట పడుతూ అతని మీద ఎంత ప్రేమైందో, మనసు పడిందో వర్ణించే విధానాన్ని స్వీట్ మెలోడీగా కంపోజ్ చేశారు తమన్. రామజోగయ్య శాస్త్రి ఇంగ్లీష్, తెలుగు కలగలసిన క్యాచీ పదాలతో నింపేయగా సాఫ్ట్ ఇన్స్ ట్రుమెంట్స్ తో ఎక్కువ హోరు లేకుండా కూల్ గా సాగింది. అయితే ఫ్యాన్స్ కి ఈ డోస్ సరిపోయినట్టు లేదని ట్విట్టర్ చూస్తే అర్థమైపోతోంది.

క్రేజీ కాంబో కావడంతో అంచనాలు మాములుగా లేవు. మహేష్ తమన్ కలయికలో బెస్ట్ మెలోడీస్ సారొచ్ఛారా(బిజినెస్ మెన్), గురువారం మార్చి ఒకటి(దూకుడు), కళావతి కళావతి(సర్కారు వారి పాట) గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. వీటి సరసన కాదు వీటిని మించి గుంటూరు కారం పాటలను ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పైగా తమన్ ని మారుస్తారంటూ షూటింగ్ కు ముందు జరిగిన ప్రచారం అభిమానుల మధ్య పెద్ద చర్చకే దారి తీసింది. అయినా త్రివిక్రమ్ ఓటు తమన్ కే పడింది. అందుకే ఓ మై బేబీ మీద అందరి ఫోకస్ పడింది. తీరా మరీ సాఫ్ట్ గా అనిపించడంతో ఫీడ్ బ్యాక్ మిక్స్డ్ వినిపిస్తోంది.

విజువల్ గా చూసేదాకా నిర్ధారణకు రాలేం కానీ దం మసాలా బిర్యానీ లాంటి ఊర మాస్ కంపోజింగ్ విన్నాక ఇలాంటి బేబీలు అంత త్వరగా మెదడుకు చేరవు. కొంత టైం పడుతుంది. ఇంకో రెండు పాటలు ఉన్నాయి కాబట్టి పూర్తి ఆల్బమ్ విన్నాకే ఒక కంక్లూజన్ కు రాగలం. అయినా మహేష్ మూవీలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటే చాలు పాటలు గొప్పగా ఉన్నా, యావరేజ్ అనిపించినా రికార్డులు గల్లంతైపోతాయి. జనవరి 12 విడుదల కాబోతున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరులోనే చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

This post was last modified on December 14, 2023 10:42 am

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

55 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago