Movie News

గుట్టుచప్పుడు కాకుండా రవితేజ రైడింగ్

ఒక పెద్ద హీరో సినిమా అందులోనూ బడా బ్యానర్ లో క్యాన్సిల్ కావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే రవితేజ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్టుని వదులుకున్నప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది. బడ్జెట్ కారణాల వల్లే దీన్ని హిందీలో సన్నీ డియోల్ తో తీయాలని నిర్ణయించుకున్నట్టుగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. దీని సంగతలా ఉంచితే హరీష్ శంకర్ డైరెక్షన్ లో కొత్త సినిమాని రవితేజ నిన్న ఫోటో షూట్ తో గుట్టుచప్పుడు కాకుండా మొదలుపెట్టేసినట్టు సమాచారం. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం స్టిల్స్ సిద్ధం చేస్తున్నారు.

ఇది బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేకనే ప్రచారాన్ని ఎవరూ ఖండించడం లేదు. అజయ్ దేవగన్ హీరోగా 2018లో వచ్చిన ఈ మనీ క్రైమ్ థ్రిల్లర్ లో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఐటి దాడుల కోసం ఒక పెద్ద మనిషి ఇంటికి రైడ్ కోసం వెళ్లిన హీరోని ప్రమాదాలు చుట్టుముడతాయి. వీటిని తప్పించుకుని తన డ్యూటీ ఎలా చేశాడనే పాయింట్ మీద మంచి థ్రిల్లర్ టైపులో తీశారు. దీన్నే కొన్ని కీలక మార్పులతో మన ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా తీస్తారని ఇన్ సైడ్ టాక్. హరీష్ శంకర్ మాత్రం ఇది స్ట్రెయిట్ మూవీ అని కానీ రీమేకని కానీ ఎక్కడ చెప్పడం లేదు.

ఈ కాంబోలో ఇది మూడో సినిమా అవుతుంది. హరీష్ శంకర్ డెబ్యూ మూవీ షాక్ హీరో రవితేజనే. ఇది ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా అతని టేకింగ్ మీద నమ్మకంతో మిరపకాయ్ ఇచ్చాడు. ఇది బ్లాక్ బస్టర్ సాధించింది. దీని తర్వాతే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఛాన్స్ రావడం, దశ తిరగడం జరిగిపోయాయి. ఆ తర్వాత హిట్లున్నాయి కానీ మరీ పెద్ద స్థాయిలో దక్కలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఏమో కాస్త షూటింగ్ చేసుకుని ఎన్నికల కోసం ఆగిపోయింది. తిరిగి మొదలుపెట్టే లోగా టైం పట్టేలా ఉంది కాబట్టి ఈలోగా మాస్ రాజాతో రైడింగ్ అయిపోతుంది. టైటిల్ ఇంకా ఏమి అనుకోలేదట.

This post was last modified on December 13, 2023 6:13 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago