సౌత్ దర్శకుల్లో భారీ డిమాండ్ ఉన్న లిస్టులో లోకేష్ కనగరాజ్ పేరు టాప్ ఫైవ్ లో ఉన్న వాస్తవం కాదనలేనిది. విజయ్ లియో విషయంలో అభిమానులు పూర్తి సంతృప్తి చెందకపోయినా తనదైన మేకింగ్ తో మరో అయిదు వందల కోట్ల బొమ్మని కోలీవుడ్ కి కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం తను సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనికన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న మూవీ ఖైదీ 2. లోకేష్ కి తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కి కొనసాగింపు కావాలని మూవీ లవర్స్ ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు.
దీనికి అనుగుణంగా కొన్ని అడుగులు పడ్డాయి. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లోని ప్రధాన పాత్రల మధ్య ఉన్న సంబంధాలను కలుపుతూ లోకేష్ కనగరాజ్ ఒక షార్ట్ ఫిలిం తీశాడు. నిడివి కేవలం పది నిముషాలు మాత్రమే. తనతో పాటు నరేన్ కూడా దీంట్లో భాగం పంచుకున్నాడు. ఢిల్లీ నుంచి లియో దాకా అందరూ ఈ మాఫియా ప్రపంచంలో ఒకరితో ఒకరు ఎలా ముడిపడ్డారనే విషయాలను వివరిస్తూ కొన్ని షాకింగ్ అంశాలను రివీల్ చేయబోతున్నారట. దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయరు. సరైన సమయం చూసి యూట్యూబ్ లో అందరూ చూసేలా ఉచితంగా తీసుకొస్తారట.
సో లోకేష్ కనగరాజ్ తన యునివర్స్ మీద సీరియస్ గా వర్క్ చేస్తున్న విషయం అర్థమైపోయింది. ఖైదీ 2 కి మాత్రం టైం పట్టేలా ఉంది. ఎందుకంటే రజని సినిమా మొదలుపెట్టే లోపు 2024 వేసవి వచ్చేస్తుంది. దాని షూటింగ్ పూర్తయిపోయి థియేటర్లలో అడుగు పెట్టడానికి ఇంకో ఏడాది. ఆ తర్వాత ఖైదీ 2. దీనికన్నా ముందు సూర్యతో రోలెక్స్ ప్లాన్ ఉంది కానీ ఏది ముందు తీయాలో లోకేష్ ఇంకా తేల్చుకోలేదు. ఈ పొట్టి సినిమా ఐడియా ఏదో వెరైటీగా అనిపిస్తోంది. ఇటీవలే జపాన్ తో డిజాస్టర్ షాక్ తిన్న కార్తీ కూడా ఖైదీ 2 పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు కానీ ఫ్యాన్స్ తో పాటు తనకూ ఎదురు చూపులు తప్పవు.
This post was last modified on December 13, 2023 12:35 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…