ఓవర్సీస్ లో ప్రమోట్ చేసుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో నవీన్ పోలిశెట్టి చూపించక మిగిలిన మీడియం రేంజ్ హీరోలు అదే దారి పట్టారు. హాయ్ నాన్న కోసం నాని యుఎస్ అంతా తిరుగుతూ థియేటర్ ఫ్యాన్స్ ని సంతోషంగా కలుసుకుంటున్నాడు. మొదటి రోజు టాక్ కాస్త అటుఇటు ఊగినా ఫైనల్ గా హిట్టు కొట్టేయడంతో తన ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే ఉద్దేశంతో నితిన్ కూడా రిలీజ్ మొదటి రోజే అమెరికా వెళ్ళిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరం హిట్టు కొడతామని అక్కడే కలిసి ఒక ఈవెంట్ లాంటిది చేస్తామని సంబరంగా చెప్పాడు. తీరా చూస్తే మొత్తం రివర్స్ అయ్యింది.
నాని ఒకపక్క వీడియోలతో హల్చల్ చేస్తుంటే నితిన్ మాత్రం సైలెంట్ అయిపోయాడు. మొదటి ఆటకే ఫలితం తేలిపోవడంతో అక్కర్లేని డాంబికాలకు పోకుండా ట్విట్టర్ తో సహా సోషల్ మీడియాలో మౌన వ్రతం పాటిస్తున్నాడు. రెండు రోజులు మినహాయించి తర్వాత ప్లాన్ చేసుకున్న థియేటర్స్ విజిట్స్ ని రద్దు చేసుకున్నాడు. కనీసం యావరేజ్ అయినా ఎంతో కొంత పుష్ వచ్చేది కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే డిస్టిబ్యూటర్లు వరల్డ్ వైడ్ కలెక్షన్ల ఫిగర్లను బయటికి చెప్పేందుకు ఇష్టపడటం లేదు. చాలా చోట్ల డెఫిషిట్లు పడటమే కారణం.
సరే జరిగిందేదో జరిగింది కానీ నితిన్ వీలైనంత త్వరగా రియాలిటీలోకి వచ్చేయడం మంచిదే కానీ దాన్ని కథలు వినేటప్పుడు కూడా అప్లై చేస్తే బాగుంటుంది. దర్శకులు ఇచ్చిన ఎలివేషన్లకు ఊగిపోకుండా వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఏ స్క్రిప్ట్ తనకు వర్కౌట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ట్రాజెడీ ఏంటంటే నితిన్ గత డిజాస్టర్ మాచర్ల నియోజకవర్గంకి వచ్చిన వసూళ్లే ఇప్పుడీ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ కంటే బెటర్ గా ఉండటం. ఏ మాత్రం పర్వాలేదు అనిపించుకున్నా ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ కి మాస్ ఆడియన్స్ మద్దతు దక్కేది. చేతులారా అవకాశాన్ని పోగొట్టినట్టు అయ్యింది.
This post was last modified on December 12, 2023 5:46 pm
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…