మేజర్ రూపంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్ దాని తర్వాత సక్సెస్ ని క్యాష్ చేసుకునేందుకు తొందరపడటం లేదు. హిట్ 2 ది సెకండ్ కేస్ విజయవంతమైనా గ్యాప్ విషయంలో రాజీ పడటం లేదు. త్వరలో గూఢచారి 2గా మారబోతున్న సంగతి తెలిసిందే. దీని బడ్జెట్ కూడా పెద్దదే. ఈలోగా మరో ప్యాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందబోయే మరీ భారీ చిత్రం ద్వారా కెమెరా మెన్ గా అనుభవమున్న షానియేల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సుప్రియ యార్లగడ్డ నిర్మాత.
ఈ ప్రాజెక్టుకి షానియేల్ ని ఎంచుకోవడానికి కారణం ఉంది. గూఢచారి, క్షణంలకు ఛాయాగ్రహణం అందిస్తున్న టైంలో ఇతని పనితనం గమినించిన శేష్ అప్పటి నుంచే ఏదైనా కథ ఉంటే కలిసి చేద్దామనే దిశగా చర్చలు చేస్తూ వచ్చాడు. అలా ఈ బంధం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. షానియేల్ తీసిన లైలా అనే షార్ట్ ఫిలిం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక కావడం గమనించాల్సిన విషయం. దర్శకుడితో పాటు అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లేలో భాగం కాబోతున్నాడు. టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. వచ్చే ఏడాది చివరిలో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. శృతి హాసన్ హీరోయిన్ కావడం మరో ఆకర్షణ.
స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తున్న అడవి శేష్ కు రాబోయే రెండేళ్లు కీలకంగా మారబోతున్నాయి. గూడచారి 2తో స్టార్ డంని సెటిల్ చేసుకోవాలని చూస్తున్నాడు. లేట్ అవుతున్నా సరే తొందరపాటు ప్రదర్శించకుండా కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు అనౌన్స్ చేసిన ప్రాజెక్టు సైతం హఠాత్తుగా సెట్ చేసుకున్నది కాదు. ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ అన్నీ సరిచూసుకున్నాకే ప్రకటన బయటికి వచ్చేలా చూసుకున్నారు. టెక్నికల్ టీమ్ ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్నపూర్ణ సంస్థ తరఫున సుప్రియ సినిమాలు, వెబ్ సిరీస్ ల నిర్మాణం వేగవంతం చేశారు.
This post was last modified on December 12, 2023 11:54 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…