చూస్తుండగానే రెండు వారాల లోపే ఏడు వందల కోట్ల వసూళ్లు దాటేసిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. డిసెంబర్ 22 దాకా నెమ్మదించే సమస్యే లేదని బాలీవుడ్ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. నిన్న మొన్న వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో హాయ్ నాన్న లాంటి హిట్ మూవీని పెట్టుకుని కూడా మంచి వసూళ్లు రాబట్టుకోవడం గమనించాల్సిన విషయం. అయితే యానిమల్ పంజా దెబ్బ తప్పించుకున్న ఇద్దరు అదృష్టవంతుల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఒకరు సన్నీ డియోల్ అయితే మరొకరు అక్షయ్ కుమార్. ఇది అర్థం కావాలంటే కొంచెం వెనక్కు వెళ్ళాలి.
యానిమల్ కు ముందు అనుకున్న విడుదల తేదీ ఆగస్ట్ 11. అదే రోజు గదర్ 2, ఓ మై గాడ్ 2 రావాలని నిర్ణయించుకున్నాయి. రన్బీర్ కపూర్ మూవీకున్న క్రేజ్ తెలిసి కూడా సన్నీ, అక్షయ్ నిర్మాతలు తలపడేందుకే సై అన్నారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంత ఆలస్యం కావడంతో పాటు ట్రైలర్ సిద్ధం కాకపోవడం వల్ల టి సిరీస్ తమ యానిమల్ ని వెనక్కు తీసుకుంది. దీంతో మిగిలిన రెండింటికి రూట్ క్లియర్ కాగా గదర్ 2 బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఓ మై గాడ్ 2 వంద కోట్లకు పైగా వసూళ్లతో చాలా గ్యాప్ తర్వాత అక్షయ్ కుమార్ ఖాతాలో హిట్ వేసింది. ఇదంతా యానిమల్ పుణ్యమే.
ఒకవేళ ఈ మూడు తలపడి ఉంటే యానిమల్ మేనియా ముందు నిలవడం పై రెండింటికి కష్టమయ్యేది. సందీప్ రెడ్డి వంగా దెబ్బకు ఇద్దరూ కుదేలైపోయేవారు. ఇది లక్కు కాక మరేమిటి. 2023లో నార్త్ డిస్ట్రిబ్యూటర్లు బాగా కోలుకున్నారు. పఠాన్, జవాన్, యానిమల్ మూడూ ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా టైగర్ 3 ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా మూడు వందల కోట్లతో పర్వాలేదనిపించుకుంది. యానిమల్ 2023 చివరి నెలను గ్రాండ్ గా ప్రారంభించగా డంకీ అంతే ఘనంగా క్లోజ్ చేస్తుందో లేక సలార్ దెబ్బకు తోక ముడుస్తుందో వేచి చూడాలి.
This post was last modified on December 11, 2023 10:29 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…