జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నా, ఆ రేంజ్‌లో స్టార్ డమ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది ప్రియమణి. ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా, టూ పీస్ బికినీ షోతో రెచ్చిపోయినా… ఎందుకో కాని యూత్‌లో రావాల్సినంత క్రేజ్ ప్రియమణికి రాలేదు. సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిలైన ప్రియమణికి, సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయట.
తాజాగా ప్రియమణి బాలీవుడ్‌లో నటించిన ‘అతీత్’ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నేరుగా రిలీజైంది. ఈ సినిమాలో తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నటించింది ప్రియమణి.
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయడం కోసం నెలల పాటు నిరీక్షించడం కంటే, విస్తరిస్తున్న డిజిటల్ ఫ్లాట్‌ఫాంను వాడుకోవడమే బెటర్ ఛాయిస్ అంటోంది ప్రియమణి. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో యమా బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ‘మైదాన్’లో నటిస్తున్న ప్రియమణి… ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సిరీస్ చేస్తోంది.
ఇక తెలుగులోనూ వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలో నటిస్తోందట ప్రియమణి. ప్రకాశ్ రాజ్ రూపొందించిన ‘మనవూరి రామాయణం’ సినిమాలో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రియమణి, నాలుగేళ్లుగా టాలీవుడ్‌లో కనిపించలేదు.
అయితే ఢీ షోలో జడ్జిగా తెలుగువాళ్లతో టచ్‌లోనే ఉంటోంది. వెంకటేష్ సరసన ‘నారప్ప’తో పాటు రానా ‘విరాట పర్వం’లోనూ మహిళా నక్సలైట్ గా నటిస్తోంది. అందుకే టాలీవుడ్‌లో ఈ ఏడాది తనకు మంచి కమ్ బ్యాక్ అవుతుందని చెబుతోంది. ఇవికాక కన్నడలోనూ రెండు సినిమాలు చేస్తోంది. అందరు హీరోయిన్లు పెళ్లైన తర్వాత అవకాశాలు కోల్పోతుంటే, ప్రియమణి మాత్రం మ్యారేజ్ చేసుకున్న తర్వాత బిజీ అయ్యింది.
This post was last modified on April 25, 2020 11:51 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…