ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్న త్రిప్తి డిమ్రి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంటర్వ్యూల కోసం మీడియా వెంటపడుతోంది. మొన్నటి దాకా ఎక్కడైనా ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే పట్టించుకోని జనం ఇప్పుడు సెల్ఫిల కోసం ఎగబడుతున్నారు. మెయిన్ హీరోయిన్ కాకపోయినా, సెకండ్ హాఫ్ లో ఒక గంటకు మాత్రమే పరిమితమైనా ఈ రేంజ్ లో ఇమేజ్ పెరగడం చాలా అరుదు. దెబ్బకు తెలుగు తమిళం నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయంటూ కథలు పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసిందన్న గాసిప్ చక్కర్లు కొట్టింది.
యూత్ లో త్రిప్తి డిమ్రికి ఇంత క్రేజ్ రావడానికి కారణమైన యానిమల్ బెడ్ రూమ్ సీన్ గురించి కొన్ని సంగతులు చెప్పుకొచ్చింది. తనతో పాటు రన్బీర్ కపూర్ దాదాపు నగ్నంగా అనిపించే ఈ రొమాంటిక్ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందే తనకు స్పష్టంగా వివరించాడు. ఏ మాత్రం అసౌకర్యం అనిపించినా మార్చేస్తానని, అసభ్యత లేకుండా తీసే బాధ్యత తన మీద ఉందని చెప్పాడు. హీరో హీరోయిన్ డైరెక్టర్ కాకుండా కేవలం కెమెరా మెన్ మాత్రమే రూమ్ లో ఉండేలా ముందే సెట్ చేసుకుని తమ జోడి మీద ఈ పడక గది షూట్ జరిగిందని క్లారిటీ ఇచ్చింది.
నిజంగానే పూర్తి వలువలు లేకుండా నటించకపోయినా ఆ స్థాయి ఇంపాక్ట్ ఆ సీన్ ఇచ్చిన మాట వాస్తవం. రన్బీర్ కపూర్ ని విపరీతంగా ఆరాధించే ఈ అమ్మాయి ఏకంగా తనతోనే జట్టు కట్టే ఛాన్స్ రావడంతో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే సినిమా చూశాక తల్లితండ్రులు కొంత భాగం చూసి ఇబ్బంది పడ్డారని, కానీ అదంతా వృత్తిలో భాగమని అర్థం చేసుకున్నాక దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా సహకరించారని చెప్పింది. ప్రస్తుతం రెండు మీడియం బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న త్రిప్తి డిమ్రికి ఇప్పుడు బడా నిర్మాణ సంస్థల నుంచి క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
This post was last modified on December 11, 2023 1:57 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…