Movie News

నలభై కోట్లతో నాన్న వన్ మ్యాన్ షో

మొదటి రోజు కొంత డల్ గా మొదలైనా వీకెండ్ మాత్రం పూర్తిగా హాయ్ నాన్న కంట్రోల్ లోకి వచ్చింది. యానిమల్ కొనసాగింపు, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ తో స్క్రీన్ పంచుకోవాల్సి రావడం లాంటి కారణాల వల్ల డిమాండ్ కు తగ్గ షోలు తెలుగు రాష్ట్రాల్లో దొరకనప్పటికీ మొత్తం నాలుగు రోజులకు గాను 40 కోట్ల గ్రాస్ దాటించి అదరగొట్టాడు. పలు ఏరియాల్లో ఆధిపత్యం స్పష్టంగా ఉంది. నైజామ్ లో 9 కోట్ల బ్రేక్ ఈవెన్ కు గాను ఆల్రెడీ 8 కోట్లు వచ్చేసింది. మొదటి వారం దాటకుండానే లాభాలు మొదలైపోతాయి. ఓవర్సీస్ లో ఆరు కోట్ల టార్గెట్ కు అయిదున్నర కోట్లు ఆల్రెడీ బయ్యర్ ఖాతాలో పడ్డాయి.

వీటితో పోలిస్తే సీడెడ్, ఆంధ్రా కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ అక్కడా అరవై శాతం పైగానే రికవరీ సాధించింది. నితిన్ సినిమా వాష్ ఔట్ సంకేతాలు స్పష్టమైపోయాయి. అయినా సరే అగ్రిమెంట్లలో భాగంగా నిన్న షోలు రన్ కావడంతో యానిమల్, హాయ్ నాన్న ఓవర్ ఫ్లోస్ ని ఎక్స్ ట్రాడినరి మ్యాన్ వాడుకుంది. షేర్ రూపంలో చూసుకుంటే హాయ్ నాన్నకు ప్రపంచవ్యాఫంగా 21 కోట్లకు పైగానే వచ్చేసింది. ఇంకో 9 కోట్లు దాటేస్తే లాభాల జోన్ లోకి వచ్చేస్తుంది. ఇవాళ సోమవారం నుంచి ఎంత డ్రాప్ ఉంటుందనే దాన్ని బట్టి ఏ స్థాయి హిట్టో బ్లాక్ బస్టరో ఇంకో వారం ఆగితే తేలనుంది.

ప్రమోషన్ల కోసం యుఎస్ లో ఉన్న నాని విస్తృతంగా టూర్లు చేస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ ఉంటే కలెక్షన్ల పరంగా మరింత జోష్ వచ్చేది కానీ ఈసారి నవీన్ పోలిశెట్టి రూటుని ఫాలో కావడం కోసం స్ట్రాటజీ మార్చేశాడు. సరిపోదా శనివారం వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల ప్లాన్ చేసుకోవడంతో నానికి బాక్సాఫీస్ గ్యాప్ వచ్చేలా ఉంది. అందుకే హాయ్ నాన్నని బెస్ట్ మెమరబుల్ మూవీగా మార్చుకునే దిశగా చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చేలా ఉంది. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న ఇటు మృణాల్ ఠాకూర్ కు కూడా మంచి హిట్ ఖాతాలో వేసింది.

This post was last modified on December 11, 2023 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వీడియో: అంబటి సంక్రాంతి సంబరాలు

భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…

22 minutes ago

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు…

1 hour ago

‘చంద్ర‌బాబు ప‌నిరాక్షసుడు’

పండుగ అన‌గానే ఎవ‌రైనా కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట‌.. కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీకి…

4 hours ago

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

7 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

12 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

13 hours ago