సినిమా పరిశ్రమని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగిస్తోంది. కఠిన చట్టాలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇకపై ఎవరైనా థియేటర్లో షో జరుగుతుండగా వీడియో రికార్డింగ్ చేస్తే 3 నెలల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా విధించే దిశగా చట్టాన్ని తేబోతోంది. అంతే కాదు ఆడిట్ చేసిన గ్రాస్ ప్రొడక్షన్ కాస్ట్ లో 5 శాతం సొమ్ముని నిర్మాతకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో కారాగారవాసం మరింత పెరుగుతుంది. అంటే సెల్ ఫోన్ తో వీడియోలు తీస్తూ పట్టుబడినా చాలు ఈ చర్యలకు గురి కాక తప్పదు.
గవర్నమెంట్ ప్రత్యేకంగా నియమించిన నోడల్ ఆఫీసర్లు నిర్మాతలు ఏదైనా పైరసీ సైట్ గురించి ఫిర్యాదు చేసిన 48 గంటల్లో దాన్ని నిరోధించే దిశగా వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఈ బృందం నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. ప్రధాన నగరాల్లో దీని ఆఫీసులు ఉంటాయి. వినడానికి బాగానే ఉంది కానీ ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఆపరేట్ చేసే పైరసీ చోరులను పట్టుకోవడం అంత సులభం కాదు. ఆయా దేశాల సహకారం చాలా అవసరం. అది లేనందు వల్లే నిందితులు పేట్రేగిపోతున్నారు. మొదటి షో పడిన గంటల వ్యవధిలో క్వాలిటీ ప్రింట్లను వెబ్ సైట్ లో పెడుతున్నారు.
ఇదంతా పక్కాగా మారడానికి చాలా సమయమే పడుతుంది. కేవలం థియేటర్లో సెల్ ఫోన్లతో షూట్ చేసే వాళ్ళను కట్టడి చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. మహా అయితే వాళ్ళ రికార్డింగ్ కొన్ని నిముషాలు మాత్రమే ఉంటుంది. అయితే పైరసీ దొంగలు ఏ థియేటర్లో ఎవరి సహకారంతో మొత్తం సినిమాను బయటికి తీసుకొస్తున్నారో దాన్ని పసిగట్టాలి. కట్టడి చేసే మార్గాలను వెతకాలి. అంతే తప్ప పై పై పూతల పనులతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయినా సరే ఈ మాత్రం కదలిక ప్రభుత్వంలో రావడం మంచిదే.
This post was last modified on December 11, 2023 8:18 am
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…