అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కామెడీ పీస్‌గా మారిపోయాడు. కరోనా విషయంలో ఆయన వ్యాఖ్యలు అలా ఉంటున్నాయి మరి. అమెరికాలో ఈ మహమ్మారి విజృంభణకు ఆయన నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
దేశంలో కరోనా ప్రమాదకర రీతిలో విస్తరిస్తుందని అమెరికా ఆరోగ్య నిపుణులు ముందే హెచ్చరించినా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారని స్పష్టమవుతోంది. కరోనా ప్రభావం పెరిగాక కూడా లాక్ డౌన్ లాంటిదేమీ అమలు చేయకుండా.. ఆర్థిక వ్యవస్థ గురించే ఆలోచించిన ట్రంప్ అందుకు గాను దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకునేలా చేశాడు. అక్కడ భారీ ప్రాణ నష్టం చోటు చేసుకోవడానికి ట్రంప్‌దే బాధ్యత అంటున్నారు. కరోనా గురించి వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
తాజాగా ట్రంప్ చేసిన ఒక కామెంట్‌పై తీవ్ర విమర్శలే వచ్చాయి. కరోనా వైరస్‌ను చంపేందుకు రోగుల శరీరంలోకి పురుగుల మందులు ఎక్కించాలంటూ మతి లేని వ్యాఖ్య చేశాడు ట్రంప్. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు ఎంతగా విరుచుకుపడుతున్నారో తెలిసిందే.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా ట్రంప్ మీద ఒక పేలిపోయే పంచ్ వేశాడు. ట్రంప్ కామెంట్ చూశాక ఇండియాలో ఈ పురుగుల మందును మించి పని చేసే మందు ఒకటుందంటూ బేగాన్‌ను సూచించాడు విష్ణు.
ట్రంప్ సార్ అడ్రస్ ఎక్కడో చెబితే.. దాన్ని పార్శిల్ చేస్తానని.. అందరి కంటే ముందు ఆయనే దీన్ని ట్రై చేయాలని సెటైర్ వేశాడు విష్ణు. ట్రంప్‌ను ట్యాగ్ చేస్తూ విష్ణు ఈ కామెంట్ చేయడం విశేషం. వరల్డ్ వైడ్ ఇంతకుమించి ట్రంప్ మీద సెటైర్లు పడుతుండటం గమనార్హం.
This post was last modified on April 26, 2020 9:36 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…