యానిమల్ దెబ్బకు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రమోషన్ల పని మీద యుఎస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్న క్రమంలో తనకెంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే కనక ఒక యాక్షన్ డ్రామాని తీస్తానని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. తనకు చిరు, పవన్ కళ్యాణ్ ల మీద ఎంత ఫ్యానిజం ఉందో పాత ట్వీట్లు, ఇంటర్వ్యూలు చూస్తే అర్థమైపోతుంది. సరే వినడానికి బాగానే ఉంది కానీ ఇది సాధ్యమయ్యే ఛాన్స్ ఏ మేరకు ఉందంటే సమాధానం చెప్పడం కష్టం.
ఎందుకంటే సందీప్ వంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ప్రభాస్ స్పిరిట్ మొదలుపెడతాడు. దానికో రెండేళ్లు వేసుకున్నా ఆ తర్వాత అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేయాలి. ఇది పూర్తయ్యేలోగా సులభంగా 2028 వచ్చేస్తుంది. అప్పటికి ఎవరికి కొత్త కమిట్ మెంట్లు ఇవ్వకపోతే చిరు కాంబినేషన్ కుదురుతుంది. అన్నింటికి మించి ముందు కథ కుదరాలి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ అంటే కమల్ హాసన్ విక్రమ్ రేంజ్ లో ఉంటేనే కిక్కు. సందీప్ ఎలాగూ రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు చేయడు కాబట్టి దానికి అనుగుణంగా చిరునే తన స్టైల్ ని మార్చుకోవాల్సి ఉంటుంది.
సో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవ్వడం తప్ప ఈ కాంబోకి చాలా టైం పడుతుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చి వీలైనంత వేగంగా చిరుతో చేసే ఛాన్స్ వస్తే తప్ప కార్యరూపం దాల్చదు. ప్రస్తుతం విశ్వంభరలో బిజీగా ఉన్న చిరంజీవి ఇంకా యానిమల్ చూశారో లేదో కానీ ఆయన వైపు నుంచి ఎక్స్ లో ఎలాంటి అభినందనల ట్వీట్ లేదు. ఆ మాటకొస్తే అల్లు అర్జున్, ప్రభాస్ లు మాత్రమే సందీప్ పనితనం గురించి ఓపెన్ గా పొగిడారు. వాళ్ళతో సినిమాలు చేయబోవడం ఒక కారణం కావొచ్చేమో కానీ మిగిలిన వాళ్ళు మాత్రం ఎందుకొచ్చిన సోషల్ మీడియా తలనెప్పని స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారు.
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…