ఎవరైనా స్టార్ ఫ్యామిలీ నుంచి హీరో హీరోయిన్లు వస్తున్నారంటే జనాల దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. ఫస్ట్ లుక్ తో మొదలుపెట్టి ఫైనల్ అవుట్ ఫుట్ దాకా చాలా నిశితంగా గమనిస్తారు. నిన్న నెట్ ఫ్లిక్స్ లో ది ఆర్చీస్ మూవీ రిలీజయ్యింది. ప్రత్యేక విశేషం ఏంటంటే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవి రెండో తనయ కం జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ దీంతో పరిచయమయ్యారు. ముంబైలో టాప్ బాలీవుడ్ సెలెబ్రిటీస్ అందరికీ స్పెషల్ షో వేస్తే ఏ ఒక్కరు మిస్ కాకుండా అందరూ వచ్చారు. ఏదో అవార్డు ఫంక్షన్ కి తరలి వచ్చినట్టు థియేటర్ మొత్తం నిండిపోయింది.
ట్విస్ట్ ఏంటంటే సుహానా, ఖుషిలు ట్రోలింగ్ బ్యాచ్ కి దొరికిపోయారు. వాళ్ళ ఎక్స్ ప్రెషన్లు, నటనను భూతద్దంలో పట్టి చూపిస్తూ సోషల్ మీడియాలో ఎగతాళి పర్వం మొదలుపెట్టారు. నిజానికి ఈ ఇద్దరూ నటన పరంగా ఇంకా బేసిక్ స్టేజిలో ఉన్నారు. శిక్షణ ఇప్పించారు కానీ ఇంకా మెరుగు పడాల్సింది చాలా ఉంది. సుహానా డాన్స్ బాగా చేసినా ఎమోషన్స్ ఎక్కువగా పండించాల్సిన సీన్స్ లో తడబడింది. ఖుషిది కూడా ఇదే సమస్య. దీంతో నెటిజెన్లు స్క్రీన్ షాట్లు తీసి మరీ టార్గెట్ చేసుకున్నారు. ఆర్చీస్ కి రివ్యూస్ పర్వాలేదనే వచ్చాయి. ఒక విభిన్న ప్రయత్నమంటూ మెచ్చుకున్నారు.
దర్శకురాలు జోయా అక్తర్ ని నమ్మి భారీ బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దీన్ని నిర్మించింది. 1960 బ్యాక్ డ్రాప్ లో లేలేత టీనేజర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఆర్చీస్ ని రూపొందించారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేందుకు భారీ సెట్లు వేసి, విఎఫెక్స్ కూడా గట్టిగానే వాడారు. అయితే కామన్ ఆడియన్స్ మాత్రం ఆర్చీస్ కి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. బోరింగ్ గా తీశారని, డ్రామా తగ్గిపోయి సంభాషణల మీద విపరీతంగా ఆధారపడటం వల్ల సాగతీత జరిగిందని విమర్శించారు. సరే ఓటిటి కాబట్టి సరిపోయింది అదే థియేటర్ సినిమా అయితే ఇదింకా తీవ్రంగా ఉండేదనడంలో డౌట్ అక్కర్లేదు.
This post was last modified on December 8, 2023 7:31 pm
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…