కెజిఎఫ్ 2 తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యష్ ఎట్టకేలకు తన 19వ సినిమాని అధికారికంగా ప్రకటించాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీకి ‘టాక్సిక్’ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన లీక్ గత అయిదారు నెలలుగా మీడియా వర్గాల్లో తిరుగుతూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ టైం నానబెడుతూ వచ్చారే తప్ప అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేయలేకపోయారు. ఎట్టకేలకు దాని చెక్ పెడుతూ టీజర్ లాంటి వీడియో రూపంలో అఫీషియల్ గా చెప్పారు.
నిజానికి కెజిఎఫ్ తెచ్చిన ప్యాన్ ఇండియా సక్సెస్ యష్ ని విపరీతమైన ఒత్తిడికి గురి చేసింది. ఏ దర్శకుడికి ఓకే చెప్పాలి, ఎలాంటి కథను ఎంచుకోవాలనే దాని మీద తేల్చుకోలేక నెలల తరబడి కాలాన్ని ఖర్చు పెట్టేశాడు. పోనీ కెజిఎఫ్ 3 చేద్దామనుకుంటే ప్రశాంత్ నీల్ సలార్ రెండు భాగాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు లాక్ చేసుకోవడంతో అప్పుడప్పుడే జరిగే పనిలా కనిపించలేదు. లైగర్ విడుదలకు ముందు పూరి జగన్నాధ్ తో సైతం ఒక రౌండ్ స్టోరీ డిస్కషన్ జరిగింది కానీ రౌడీ హీరో రిజల్ట్ చూశాక ఇంకే ఆలోచన చేయకుండా దాన్ని ప్రతిపాదన స్టేజి దగ్గరే ఆపేశాడని టాక్.
టాక్సిక్ విడుదల తేదీని ప్రకటించేశారు. 2025 ఏప్రిల్ 10 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్ చివర్లో ఇచ్చేశారు. అంటే నిర్మాణానికి ఏడాదికి పైగా సమయం పడుతుందన్న మాట. గోవా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా రూపొందబోయే టాక్సిక్ కి గీతూ మోహన్ దాస్ నే యష్ ఎంచుకోవడానికి ఆమె ట్రాక్ రికార్డు కారణం. కమర్షియల్ స్టార్లను డీల్ చేయడంలో అనుభవం లేకపోయినా ఒక డైరెక్టర్ ఆమెకున్న పట్టుకు సాధించిన విజయాలే నిదర్శనం. అందుకే కాస్త లేట్ అయినా ఫైనల్ గా సెట్ చేసుకున్నాడు. అన్ని ప్రధాన భాషల్లో టాక్సిక్ రాబోతోంది
This post was last modified on December 8, 2023 10:17 am
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…