ఒకప్పటి ఖల్ నాయక్ సంజయ్ దత్ మన దక్షిణాది దర్శకులకు లక్కీ హ్యాండ్ గా మారుతున్నాడు. కెజిఎఫ్ చాప్టర్ 2లో చేసిన అధీరా మంచి పేరు తీసుకు రావడంతో తన కోసమే పాత్రల డిజైన్ ని మార్చి మరీ స్టార్ హీరోల కోసం డైరెక్టర్లు ఆయన్ను తీసుకొస్తున్నారు. ఇటీవలే విజయ్ లియోలో తన క్యారెక్టర్ బాగా పేలిన సంగతి తెలిసిందే. అర్జున్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ పక్కన ఉన్నా సంజు బాబా తన ఉనికిని చూపించుకోవడంలో ఎక్కడా తగ్గలేదు. కేడి డెవిల్ అనే మరో కన్నడ ప్యాన్ ఇండియా మూవీలోనూ సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇప్పుడు ఎంట్రీ తెలుగు దాకా వచ్చేసింది.
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సంజయ్ దత్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఈ మేరకు ముంబైలో లుక్ టెస్ట్ కూడా అయిపోయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ లో కాలు పెట్టబోతున్నారు. సంజయ్ దత్ ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా సరే ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదు. చిరంజీవి విశ్వంభరకు కూడా అడిగే ప్రతిపాదన ఉందట కానీ అదెంత వరకు నిజమో యూనిట్ ధృవీకరించే దాకా చెప్పలేం. రాఖీ భాయ్ నే భయపెట్టిన సంజయ్ దత్ ఇప్పుడు ప్రభాస్ తో తలపడటం అంటే అంతకన్నా క్రేజీ కాంబినేషన్ ఇంకేముంటుంది.
విచిత్రం ఏంటంటే సౌత్ లో సంజయ్ దత్ అడుగు పెట్టింది కెజిఎఫ్ తో కాదు. ఎప్పుడో 1998లో నాగార్జున చంద్రలేఖలో కొద్దీ నిముషాలు కనిపించే చిన్న క్యామియో చేశారు. సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తులేకపోయింది కానీ అక్కినేని ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు. మరో సౌత్ దర్శకుడు ఆట్లీ సైతం జవాన్ లో ఒక స్పెషల్ క్యామియోకి ఈయనను వాడుకోవడం గుర్తేగా. ట్విస్ట్ ఏంటంటే సంజయ్ దత్ కి బాలీవుడ్ లో ఇన్ని క్రేజీ ఆఫర్లు లేవు. మరి ప్రభాస్ మూవీలో ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడో వేచి చూడాలి. ఇప్పట్లో ఫస్ట్ లుక్ గట్రాలు రాకపోవచ్చు.
This post was last modified on December 7, 2023 10:03 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…