తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో ఎలాంటి పాలన ఉండబోతోందోనని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ కూడా ఉంది. పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం తరఫున పరిశ్రమకు పెద్దగా సమస్యలేం రాలేదు. టికెట్ రేట్లకు సంబంధించి అవసరమైనప్పుడు వెసులుబాట్లు వచ్చాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే ఇక్కడెలాంటి విషమ పరిస్థితులు తలెత్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో అంతకు మించిన సహాయ సహకారాలు ఉంటాయని ఇండస్ట్రీ పెద్దలు ఆశిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చాక మౌనంగా ఉంటూ వచ్చిన సెలబ్రిటీలు ఇవాళ అధికారిక కార్యక్రమం పూర్తవ్వగానే శుభాకాంక్షలు అందజేస్తున్నారు. చిరంజీవి, రవితేజ, నాగార్జున, విశ్వక్ సేన్, సుధీర్ బాబు, హరీష్ శంకర్, వైజయంతి మూవీస్, రాహుల్ రామకృష్ణ, శ్రీను వైట్ల, గోపి మోహన్ తదితరులతో నిముషాలు గడిచే కొద్దీ ఈ లిస్టు పెరుగుతూ పోతోంది. బిజీగా ఉన్న కారణంగా రేవంత్ రెడ్డి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇంకా స్పందనలు రాలేదు కానీ ఆ లాంఛనం కూడా మొదలవుతుంది. ఇంకా విష్ చేయాల్సిన వాళ్ళు ఒక్కొకరుగా యాడ్ అవుతూనే ఉంటారు.
ఇంకో రెండు వారాల్లో సలార్ విడుదల ఉంది. పరిశ్రమకు సంబంధించి మొదటి విన్నపం దీనికి సంబంధించే వెళ్లొచ్చు. అనుమతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు కానీ అటు ఏపీలో పర్మిషన్ల వ్యవహారం తేలాల్సి ఉంది. టాలీవుడ్ తరఫున రేవంత్ రెడ్డి సన్మానం చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన కొందరు పెద్దలు పెడుతున్నారు కానీ గతంలో కేసీఆర్, అటు పక్క జగన్ కు చేయనిది ఇప్పుడు ప్రత్యేకంగా చేస్తే వేరే సంకేతాలు వెళ్లొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అందుకే అలాంటిదేమి ఉండకపోవచ్చు కానీ వ్యక్తిగత కలయికలు ఉంటాయి.
This post was last modified on December 7, 2023 9:56 pm
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…
సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే…
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…
ఇవాళ విడుదలైన తండేల్ కు మంచి టాకే వినిపిస్తోంది. అదిరిపోయింది, రికార్డులు కొల్లగొడుతుందనే స్థాయిలో కాదు కానీ నిరాశ పరచలేదనే…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…