ఇప్పుడంటే యానిమల్ మానియాలో సందీప్ వంగా సృష్టించిన విపరీత ధోరణుల హీరోయిజంని కొత్తగా ఫీలవుతున్నాం కానీ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే ఉపేంద్ర వీటికి శ్రీకారం చుట్టిన సంగతి అప్పటి యూత్ గా ఉన్న వాళ్లకు బాగా తెలుసు. ఒక కొత్త హీరో కన్నడ డబ్బింగ్ మూవీ తెలుగులో సంచలనాత్మక వసూళ్లు సాధించడం A రూపంలో చూశాం. ఆ తర్వాత తన పేరునే టైటిల్ గా పెట్టుకుని ఆడవాళ్ళను ట్రీట్ చేసే విధానాన్ని కొత్తగా చూపించడం విమర్శకులను సైతం అబ్బురపరిచింది. రా సినిమాలో హీరోయిన్, ఆమె తల్లిని వెంటపడి చితకబాదే సన్నివేశం ఇప్పటికీ ట్రెండ్ అవుతుంటుంది.
ప్రస్తుతం ఉపేంద్ర ఒక పేరు లేని ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ నామం సింబల్ పెట్టడంతో దాన్ని యుగా వ్యవహరిస్తున్నారు అభిమానులు. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు, క్యారెక్టరైజేషన్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తారని ఇన్ సైడ్ టాక్. విరూపాక్ష, మంగళవారంలతో మనకు బాగా దగ్గరైన అజనీష్ లోకనాథ్ సంగీతం చాలా విభిన్నంగా ఉంటుందట. ఫ్యాన్స్ ప్రేమగా ఉప్పి అని పిలుచుకునే ఈ విలక్షణ నటుడి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ వంద కోట్లకు పైగా ఖర్చుతో దీన్ని భారీ ఎత్తున రూపొందిస్తున్నారు.
సందీప్ వంగా, ఉపేంద్రల మధ్య ఒక్క పోలికని స్పష్టంగా గమనించవచ్చు. లేడీ క్యారెక్టర్స్ మీద గౌరవం చూపిస్తూనే అవసరమైన చోట వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించేలా చేసి దాన్ని ప్రేక్షకులు ఒప్పుకునేలా చేయడం వీళ్ళ శైలి. అందుకే యానిమల్ సీన్లను అప్పట్లో వచ్చిన ఉపేంద్ర చిత్రాలతో పోలుస్తూ మూవీ లవర్స్ కంపారిజన్లు చేస్తున్నారు. ఆ మధ్య యు ట్రైలర్ లాంచ్ కి శివ రాజ్ కుమార్ ని తీసుకొచ్చి వేలాది అభిమానుల మధ్య బ్లాంక్ స్క్రీన్ మీద ఏమి చూపించకుండా వదిలేయడం దగ్గరి నుంచే ఉపేంద్ర మార్కు మొదలైంది. ఇందులో సన్నీ లియోన్, మురళీశర్మ ఇతర ప్రధాన తారాగణం.
This post was last modified on December 6, 2023 12:40 pm
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…