Movie News

యానిమల్ పార్క్ నిజంగా ఛాన్స్ ఉందా

బాక్సాఫీస్ వద్ద సునామిలా విరుచుకుపడిన యానిమల్ మొదటి వారం పూర్తయ్యేలోపే అయిదు వందల కోట్ల మార్కుని దాటేయడం ట్రేడ్ మతులు పోయేలా చేసింది. టాక్స్, రివ్యూస్, అభిప్రాయాలు ఎన్ని రకాలుగా వచ్చినా ఆడియన్స్ మాత్రం థియేటర్లకు పోటెత్తిన మాట వాస్తవం. నార్త్ సూపర్ స్టార్ ట్యాగ్ కి రన్బీర్ కపూర్ న్యాయం చేసే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చాడని అభిమానులు మురిసిపోతున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫోన్ నాన్ స్టాప్ గా మ్రోగుతూనే ఉంది. అయితే సినిమా చివరి ఎండ్ టైటిల్స్ అయ్యాక సీక్వెల్ ని యానిమల్ పార్క్ పేరుతో ప్రకటించడం సంగతి తెలిసిందే.

నిజంగానే ఇది తెరకెక్కుతుందా అనే ప్రశ్నకు పలు రకాల విశ్లేషణలు మొదలయ్యాయి. కొందరు ఏకంగా స్టోరీ కూడా పుట్టించారు. అదేంటో చూద్దాం. బాబీ డియోల్ ఫ్లాష్ బ్యాక్ ని డిటైల్డ్ గా చూపించి ఆ తర్వాత అనిల్ కపూర్ చంపడం ద్వారా రణ్ విజయ్ సింగ్ సామ్రాజ్యంలోకి అతని బాడీ డబుల్ ని సృష్టిస్తారు శత్రువులు. అతనే చివరి వయోలెంట్ సీన్ లో కనిపించిన డూప్లికేట్ రన్బీర్. మరో ట్విస్టు ఏంటంటే ముల్లుని ముల్లుతోనే తీయాలన్న రీతిలో అబ్రార్ చనిపోయినా సరే అతనికి కూడా బాడీ డబుల్ ని సృష్టించి అరాచకాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తారు. ఇదంతా అఫీషియల్ వెర్షన్ కాదు.

వినడానికి బాగానే ఉంది కానీ సందీప్ వంగా ముందు ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్ ని పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళాలి. ఆ తర్వాత అల్లు అర్జున్ తో చేసే ప్యాన్ ఇండియా మూవీ పనులుంటాయి. ఇవన్నీ అయ్యేలోపు 2026 వచ్చేస్తుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా ఆలస్యం జరిగితే తప్ప యానిమల్ పార్క్ సాధ్యపడదు. అయినా సందీప్ వంగా హడావిడి పడే రకం కాదు. ఏదో క్రేజ్ ఉంది కదాని దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో షూటింగులు చేయడు. అలాంటప్పుడు ఎంత డిమాండ్ చేసినా యానిమల్ పార్క్ ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఏదో మిరాకిల్ జరిగితే తప్ప ఆశించడం కూడా రైట్ కాదు.

This post was last modified on December 6, 2023 12:21 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago