ఇండియన్ బాక్సాఫీస్ లో గత వారం రోజులుగా చర్చలన్నీ అనిమల్ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. విడుదలకు ముందు నుంచే చర్చనీయాంశంగా మారిన యానిమల్.. రిలీజ్ తర్వాత మరింతగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కొందరికి పిచ్చిపిచ్చిగా నచ్చితే.. కొందరికి అంతగా ఆగ్రహం తెప్పించింది. పాజిటివ్, నెగిటివ్ రియాక్షన్లు ఏవైనా సరే తీవ్రస్థాయిలోనే ఉన్నాయి.
అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ రిలీజ్ టైం లో ఆ చిత్రాన్ని వైలెంట్ ఫిలిం అన్నారని.. అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో తన తర్వాత చిత్రంలో చూపిస్తానని అన్న సందీప్ రెడ్డి.. చెప్పినట్లే యానిమల్ సినిమాలో హింసను పతాక స్థాయికి తీసుకెళ్లాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, ఇంకా క్లైమాక్స్ లో అతను ఎంతటి విధ్వంసం సృష్టించాడో తెలిసిందే. తెరంతా రక్తంతో తడిసిపోయింది ఆ సన్నివేశాల్లో. చివర్లో యానిమల్ పార్క్ అనే టైటిల్ వేసి సీక్వెల్ కు హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి.
యానిమల్ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూశాక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ రిలీజ్ ఇంటర్వ్యూలలో సందీప్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు. యానిమల్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం కీలకమని.. అది వచ్చిందంటే మాత్రం తాను, రణబీర్ కలిసి ఇంకో ఐడియాను వర్క్ అవుట్ చేస్తామని.. అది యానిమల్ తో పోలిస్తే చాలా డార్క్ గా ఉంటుందని.. తామిద్దరం మరింత డార్క్నెస్ లోకి దూకేస్తామని.. తమకు ఆ రకమైన కాన్ఫిడెన్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు సందీప్ రెడ్డి.
ఇప్పుడు అతను కోరుకున్నట్లే యానిమల్ బ్లాక్ బస్టర్ అయింది. కబీర్ సింగ్ తర్వాత మోస్ట్ వైలెంట్ ఫిలిం అని హింట్ ఇచ్చి అలాంటి సినిమానే తీసిన సందీప్ రెడ్డి.. ఇప్పుడు మరింత డార్క్ ఫిలిం అనే మాట చెప్పి ఎలాంటి సినిమాతో వస్తాడో అనే ఆసక్తి అతడి అభిమానులు వ్యక్తమవుతోంది.
This post was last modified on December 5, 2023 10:59 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…