ఈ శుక్రవారం విడుదల కాబోయే ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ మీద క్రమంగా బజ్ పెరుగుతోంది. ఓవర్ మాస్ జోలికి వెళ్లి మాచర్ల నియోజకవర్గంతో షాక్ తిన్న నితిన్ తిరిగి ఎంటర్ టైన్మెంట్ రూటు పట్టాడు. స్టార్ రైటర్ గా కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్స్ కి పని చేసిన వక్కంతం వంశీకి దర్శకుడిగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రూపంలో డెబ్యూ చేదు జ్ఞాపకంగా నిలిచింది. అందుకే తన సత్తా చాటేందుకు దీన్నే అవకాశంగా మలుచుకున్నారు. వీళ్ళ సంగతి కాసేపు పక్కనపెడితే హీరోయిన్ శ్రీలీలని హీరోతో సహా టీమ్ బాగా హైలైట్ చేయడం ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ స్పష్టంగా కనిపించింది.
నితిన్ తన ప్రసంగంలో శ్రీలీలపై మాములు ప్రశంసలు గుప్పించలేదు. ఒక నటిగానే కాకుండా డాక్టర్ గా, డాన్సర్ గా, హాకీ స్విమ్మింగ్ చేసే క్రీడాకారిణిగా ఎంతో ప్రతిభ ఉన్న మల్టీటాలెంటెడని సర్టిఫికెట్ ఇచ్చాడు. భరతనాట్యం, కూచిపూడిలోనూ తన ప్రావీణ్యం గురించి ప్రస్తావించాడు. ఇంత బిజీలోనూ తమకు డేట్స్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు అందజేశాడు. ఆ మధ్య ప్రెస్ మీట్ లో శ్రీలీల గురించి ప్రత్యేకంగా మాట్లాడిన నితిన్ ఆమె ఉండటంని అతి పెద్ద ప్లస్ గా భావిస్తున్నాడు. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీలీలకు ఆదికేశవ డిజాస్టర్ చిన్నపాటి కుదుపు ఇచ్చింది.
ఇప్పుడీ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సక్సెస్ కావడం శ్రీలీలకు కీలకమే. కథ ఎక్కువ నితిన్ చుట్టే తిరిగినా ధమాకా తరహాలో తగినన్ని కమర్షియల్ అంశాలు, డాన్స్ చేయడానికి స్కోప్ ఉన్న పాటలు పడ్డాయి. సో ఇవి కనక క్లిక్ అయితే రిపీట్ ఆడియన్స్ ఉంటారనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. హరీష్ జైరాజ్ సంగీతం, జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ తో వేయించిన పలు గెటప్పులు, కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కంటెంట్ మీద నమ్మకంతో కొన్ని జిల్లా కేంద్రాల్లో రెగ్యులర్ గా మొదలయ్యే పదకొండు గంటలకు బదులుగా ఉదయం తొమ్మిదికే షోలు వేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on December 5, 2023 10:46 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…