Categories: Movie News

మా కుటుంబానికి సంబంధం లేదు – అల్లు అరవింద్

ఇటీవల గోవాలో జరిగిన ఒక సినిమా అవార్డు ఫంక్షన్ లో కొన్ని అవాంతరాలు తలెత్తి కన్నడ నుంచి వచ్చిన నటీనటులకు అసౌకర్యం కలగడం చిన్నపాటి దుమారానికి దారి తీసింది. దాని నిర్వాహకుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన పిఆర్ఓగా కన్నడ మీడియా వర్గాల్లో ప్రచారం జరగడంతో నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఒక బ్యానర్ లాంచ్ కి అతిధిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ ఒక ప్రైవేట్ జర్నలిస్ట్ ఎప్పటి నుంచో ఈ ఫంక్షన్ చేస్తున్నాడని, ఈసారి ఫెయిల్ కావడం అతని వ్యక్తిగత బాధ్యత తప్పించి మా కుటుంబానికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

నిన్న కొందరు శాండల్ వుడ్ నటీనటులు దీని గురించి ట్వీట్లు పెట్టడంతో అక్కడి పత్రికల్లో మెగా పిఆర్ఓ చేసిన ఫంక్షన్ గా ప్రచారం జరిగింది. దీనికి తోడు వేడుక నిర్వహించిన విధానం పట్ల వాళ్ళు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయాన్ని హైలైట్ చేయడంతో క్రమంగా ఈ వివాదం పబ్లిక్ లోకి వచ్చేసింది. ఏవో బిల్లుల చెల్లింపులో జరిగిన ఆలస్యం వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పాటు హోటల్ వ్యయం సమయానికి జమ చేయకపోవడం వల్ల రభసకు దారి తీసిందని అంటున్నారు. సదరు వ్యక్తి గురించి పేరు కానీ, ఇంకే ఇతర వివరాలు కానీ అల్లు అరవింద్ నేరుగా ప్రస్తావించలేదు.

ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక ప్రైవేట్ వేడుకని టాలీవుడ్ కు ఆపాదించడం కరెక్ట్ కాదు అనేది అరవింద్ గారి వెర్షన్. ఇందులో న్యాయముంది. ఇది మా అసోసియేషన్ లేదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చేస్తున్న ఈవెంట్ కాదు. పోనీ ఈఫా, ఫిలిం ఫేర్ లాంటివి అయితే వాటి వ్యవహారం ప్రొఫెషనల్ గా ఉంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. అల్లు అరవింద్ స్వయంగా చెప్పాక ఆయన వివరణ వీడియో రూపంలో సోషల్ మీడియాలో తిరుగుతోంది. అయినా బయట రాష్ట్రాల్లో ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.

This post was last modified on December 4, 2023 4:13 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

16 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago