బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతున్న యానిమల్ కి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వరదలా పారుతున్నాయి. క్రమంగా సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఒక పెద్ద రివ్యూ రాసి మరీ గూగుల్ ఫార్మ్ లో దాన్ని షేర్ చేసుకున్నారు. హీరోయిన్ త్రిష ఇవాళ తన ఇన్స్ టాగ్రామ్ లో యానిమల్ ని అభినందిస్తూ కల్ట్ అనే పదం పెట్టి, దాని కిందా ప్పా అంటూ సుదీర్ఘమైన స్మైలీలతో కూడిన ఎక్స్ ప్రెషన్లు ఎమోజిల రూపంలో ఇచ్చింది. ఏమయ్యిందో ఏమో కానీ నిమిషాల వ్యవధిలోనే దాన్ని డిలేట్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.
నిజానికి యానిమల్ టేకింగ్, రన్బీర్ యాక్టింగ్ పట్ల ఎంత గొప్ప ప్రశంసలు వచ్చినా అడల్ట్ డైలుగులు, సెక్స్ సన్నివేశాల పట్ల పలు వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతూనే ఉంది. ఎంత ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని డిసైడ్ అయినా సరే హీరోని ఇంటి బయట నగ్నంగా తిరిగి నట్టు చూపించి దాన్ని యాటిట్యూడ్ అంటారాని నిలదీస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఇక రష్మిక మందన్నని పెళ్లి చేసుకున్నాక కూడా ఏదో నిజం రాబట్టడం కోసం త్రిప్తి డిమ్రితో నడిపించే భాగోతం మీద కూడా కామెంట్లు వచ్చాయి. ఇవన్నీ మాస్, యూత్ కి విపరీతంగా నచ్చినవే. సంప్రదాయవాదులు వ్యతిరేకరించారు.
అందుకేనేమో యానిమల్ ని మెచ్చుకుంటే తన మీద సోషల్ మీడియాలో లేనిపోని నెగటివిటీ వస్తుందని భావించి త్రిష డిలీట్ చేసినట్టు ఉంది. దానికి తగ్గట్టే స్టోరీ పెట్టిన కాసేపటికే కామెంట్స్ వచ్చినట్టు ఉన్నాయి. నిజానికీ సినిమాకు తమిళనాడులో భారీ కలెక్షన్లు రావడం లేదు. అయినా నయనతార అన్నపూరణి యానిమల్ తో పాటే రిలీజైనప్పుడు దాని గురించి నాలుగు ముక్కలు చెప్పాలనేది అరవ ఫ్యాన్స్ అభిప్రాయం. ఏది ఏమైనా స్వంతంగా మనసులో మాటలు ట్విట్టర్, ఇన్స్ టాలో పంచుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వచ్చేలా ఉంది. ఇంతకన్నా ఉదాహరణ కావాలా.
This post was last modified on December 4, 2023 8:45 am
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…